తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel


Гео и язык канала: Индия, Английский
Категория: Криптовалюты


తిరుమల సమాచారం. https://www.youtube.com/laxmitelugutech

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Английский
Категория
Криптовалюты
Статистика
Фильтр публикаций


Tirupati SSD & Srivari Mettu Tokens Present Available Status


శ్రీవారి సేవకుల విధుల కేటాయింపు వారి మొత్తం సేవా కాలంలో ఒకే విభాగంలో లేదా ప్రదేశంలో చేయబడుతుంది.

ఆ సమయంలో TTD యొక్క నిర్దిష్ట అవసరాలను బట్టి సేవకులకు విధుల కేటాయింపు వ్యక్తిగతంగా లేదా సమూహాలలో చేయవచ్చు.

ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారానే శ్రీవారి సేవకులకు ఆలయ విధులు కేటాయిస్తున్నారు. ప్రతి బృందం ఆలయ విధులను పొందడం తప్పనిసరి కాదు.

ఈ విషయంలో ఏదైనా విచలనం వినోదం పొందదు.


Tirupati SSD & Srivari Mettu Tokens Present Available Status




🙏 Om Namo Venkatesaya 🙏

17-11-2024

Total pilgrims - 71,441

Tonsures: 23,595

Hundi kanukalu : 3.87 Cr

Waiting Compartments…03

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens)... 8 H

(SSD)Time slot Sarvadarshan... 2 to 4 H

Rs 300 Special Darshan Approx. Time... 1 to 3 H

Tq.

------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి గంటల సమయం 5 పడుతుంది, అంటే అది SSDటోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 5 గంటలు అని.

ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

----
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-

https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

https://t.me/LaxmiTeluguTech

https://www.youtube.com/@TtdLatestUpdates

👉 New Channel ( ఇ News తెలుగు ) :-https://www.youtube.com/@enewstelugu?sub_confirmation=1


Tirupati SSD & Srivari Mettu Tokens Present Available Status


Tirupati SSD & Srivari Mettu Tokens Present Available Status


Tirupati SSD Tokens Present Available Status


Offline Accommodation availability information at the CRO, Tirumala, as of 04:40AM today.


Tirupati SSD Tokens Present Available Status


Tirupati SSD Tokens Present Available Status


Tirupati SSD Tokens Present Available Status

SSD Tokens Status Updates👇

👉WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

👉 Telegram group:- https://t.me/LaxmiTeluguTech

👉 Telegram Channel :- https://t.me/LaxmiTeluguTechChannel

👉Youtube Channel :-https://www.youtube.com/@LaxmiTeluguTech

👉New Channel ( ఇ News తెలుగు ) :-https://www.youtube.com/@ENewsTelugu


SSD Tokens:- తిరుపతిలో ఉదయం 1.45 / 2 గంటల నుంచి ఉచిత దర్శనం టోకెన్లు ఇస్తారు, ఇచ్చు ప్రదేశాలు

🔔 శ్రీనివాసం - RTCబస్టాండ్ దగ్గర

🔔 విష్ణు నివాసం -రైల్వే స్టేషన్ ఎదురుగా

🔔 భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి దగ్గర

శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ఉదయం 5.45 / 6.00 నుండి ఆ నడకదారిలో ఇస్తారు.

Note: ON Alipiri Steps Tokens will Not be Given
-

SSD - TIRUPATI - OPENING COUNT
STARTS FROM 1.45 / 2 AM - SRINIVASAM + VISHNUNIVASAM + BHUDEVI COMPLEX

DD - SRIVARI METTU - OPENING COUNT
STARTS FROM 5.45 / 6 AM ON 50TH STEP
TICKET SCANNING COMPULOSRY ON 1250 STEP

Note: Bring Original Aadhar or printout with clearly identifiable photo. Softcopy in mobile Not allowed.
-

SSD Tokens Status Updates👇

👉WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

👉 Telegram group:- https://t.me/LaxmiTeluguTech

👉 Telegram Channel :- https://t.me/LaxmiTeluguTechChannel

👉Youtube Channel :-https://www.youtube.com/@LaxmiTeluguTech

👉New Channel ( ఇ News తెలుగు ) :-https://www.youtube.com/@ENewsTelugu




ఉత్త‌రాది మ‌ఠం పీఠాధిప‌తిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్

తిరుమల, 2024 నవంబరు 17: ఉత్త‌రాది మ‌ఠం పీఠాధిప‌తి శ్రీ స‌త్యాత్మ తీర్థ‌ స్వామీజీని టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమలలోని ఉత్త‌రాది మ‌ఠానికి చైర్మన్ దంపతులు ఆదివారం విచ్చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ దంపతులకు స్వామీజీ ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ సనాతన ధర్మవ్యాప్తిని విస్తృతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్వామీజీ చైర్మ‌న్ కు సూచించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


తిరుపతిలో కార్తీక మ‌హా దీపోత్స‌వానికి ఏర్పాట్లు పూర్తి: టిటిడి

తిరుప‌తి‌, 2024 న‌వంబ‌రు 17: తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప‌రేడ్ మైదానంలో నవంబరు 18వ తేదీ రాత్రి నిర్వహించనున్న కార్తీక మ‌హాదీపోత్స‌వానికి టిటిడి చేపట్టిన విస్తృత ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

హెచ్ డీపీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవానికి భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని టిటిడి కోరుతోంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించనున్నారు.

ఇందులో భాగంగా మ‌హిళ‌లు కూర్చుని దీపాలు వెలిగించేలా దీప‌పు దిమ్మెలు, నేతి వ‌త్తులు ఏర్పాటు చేస్తున్నారు. మైదానం మొత్తం తివాచీలు, ఒక్కో దీపపు దిమ్మె వ‌ద్ద తుల‌సి మొక్క‌ను ఉంచనున్నారు. కార్య‌క్ర‌మం అనంత‌రం మ‌హిళ‌లకు ఈ మొక్క‌ల‌ను అందిస్తారు.

వేదిక‌ను శోభాయ‌మానంగా పుష్పాల‌తో, విద్యుత్ దీపాలు, వేదిక ఇరువైపులా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సెట్టింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా నిర్వహించనున్న శ్రీ మ‌హాల‌క్ష్మీపూజ‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేపట్టారు. టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప్ర‌ధాన ద్వారాల నుంచి ఆవ‌ర‌ణం మొత్తం అర‌టి చెట్లు, పూలు, విద్యుద్దీపాల‌తో అలంకరించనున్నారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




👆తిరుమలలో వైభవంగా కార్తీక స్నపన తిరుమంజనం

తిరుమల, 2024 నవంబరు 17: పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వన భోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం తిరుమల వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు, ఉభయనాంచారులను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు.

అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.

సాధారణంగా కార్తీక మాసంలో పార్వేట మండపంలో టీటీడీ వనభోజనం నిర్వహిస్తుంది. అయితే భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వేదికను తిరుమల ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపానికి మార్చారు.

స్నపనం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వీజీవో శ్రీ సురేంద్ర, పేష్కర్ శ్రీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




👆టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా టీటీడీ ఈవో ప్రమాణ స్వీకారం

తిరుమల, 2024 నవంబరు 17: టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆదివారం తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈవో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం అడిషనల్ ఈవో శ్రీ‌వారి తీర్థ ప్ర‌సాదాలు, చిత్ర‌ప‌టాన్ని అందించారు.

ఈ సందర్భంగా ఆలయం ముందు ఈవో మీడియాతో మాట్లాడుతూ బోర్డు సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయడం శ్రీవారు ఇచ్చిన పవిత్రమైన అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. గత ఐదు నెలలుగా టీటీడీలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. సామాన్య భక్తులకు సౌకర్యాల కల్పన, అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

శ్రీవారి ఆశీస్సులతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. తిరుమలలో దళారులను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా టీటీడీ బోర్డు ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ శ్రీధర్, డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, వీజీవో శ్రీ సురేంద్ర, పేష్కార్ శ్రీ రామకృష్ణ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Показано 20 последних публикаций.