Telugu books n magazines


Гео и язык канала: Индия, Телугу
Категория: Книги


A book can change your life

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Телугу
Категория
Книги
Статистика
Фильтр публикаций


అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు.
“ ఇది లవంగాల దేశం, మీరు ఇక్కడ లవంగాలు అమ్మడానికి వచ్చారా? మీకు అలాంటి సలహా ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా, ఆ వ్యక్తి మీ శత్రువు అయి ఉండాలి! ఇక్కడ, మీరు ఒక పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు. ఇక్కడ మీ నుండి లవంగాలు ఎవరు కొంటారు, ఇంక మీరు ఏం సంపాదిస్తారు? ”

ధరమ్ పాల్, “ నేను అదే పరీక్షించాలనుకుంటున్నాను ప్రభూ ! నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి. నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది. కాబట్టి, ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలనుకుంటున్నాను.”

సుల్తాన్ ఇలా అడిగాడు, “తండ్రి ఆశీస్సులా ! అంటే దాని అర్థం ఏమిటి?!"

అప్పుడు ధరమ్ పాల్ అతనికి వివరించాడు, *“మా తండ్రి ఆయన జీవితమంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేశారు, కానీ డబ్బు సంపాదించలేకపోయారు. మరణ సమయంలో నా చేతిపై చేయివేసి, నీ చేతిలోని ధూళి కూడా బంగారంగా మారాలని ఆశీర్వదించారు"*, అని ఆ మాటలు మాట్లాడుతూ, ధర్మపాల్ వంగి నేల నుండి గుప్పెడు ఇసుక తీసుకున్నాడు.
ఇసుకను తన వేళ్ళ మధ్య జారిపోనిస్తూ, సుల్తాన్ ముందు గుప్పిటను తెరిచేసరికి, ధర్మపాల్, సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.

ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరమ్ పాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలిఉంది.

సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం ఇదే. అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు.

“ఇది మహాద్భుతం ! ఓ అల్లా , చాలా కృతజ్ఞతలు, మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేసారు! ” .

అదే భగవంతుడు సాధువు ఆశీస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరమ్ పాల్ అన్నాడు.
అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు. అతను ధరమ్ పాల్ ని కౌగిలించుకొని, " ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను" అన్నాడు.

ధరమ్ పాల్ ఇలా అన్నాడు, “నువ్వు 100 ఏళ్లు జీవించి, నీ ప్రజలను బాగా చూసుకోగాక ! ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నాకు మరేమీ అక్కర్లేదు."

సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి, “నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను. మీరు కోరుకున్నంత ధర ఇస్తాను”, అన్నాడు.

కాబట్టి, ధరమ్ పాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు.

*తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం.*

వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్ని ఇస్తుంది. మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ.

*ఈ ప్రపంచం అంతా అనేకమైన అవకాశాలతో నిండిఉంది. సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది, కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, అసాధ్యమైన సంఘటన సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది.*


*తండ్రి ఆశీర్వాద బలం.*

ప్రాణం విడిచే ముందు ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధరమ్ పాల్ ని పిలిచి, “బాబూ, నేను ఏ సంపదను ఇవ్వలేకపోయాను. గానీ జీవితాంతం ఎల్లప్పుడూ నిజాయితీగా, నా వ్యాపారంలో ఉన్నాను.
ఆ నిజాయితీ బలంతో నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది ! " అని కుమారుడి తలపై చేయివేసి, సంతృప్తిగా, ప్రశాంతంగా తుదిశ్వాస విడిచాడు.

ధరమ్ పాల్ భక్తితో తన తండ్రి అంత్య క్రియలు పూర్తి చేశాడు.

ఇప్పుడు కొడుకు ధరమ్ పాల్ తోపుడు బండిపై స్వీట్ వ్యాపారం ప్రారంభించాడు. కొద్దిరోజుల లోనే తర్వాత, ఒక చిన్న దుకాణాన్ని కొన్నాడు. సరుకుల నాణ్యత వలన క్రమంగా, వ్యాపారం మరింత విస్తరించింది. మూడేళ్ళకు నగరంలోని ఐశ్వర్యవంతులలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను పూర్తిగా విశ్వసించాడు.

తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసం కానీ, ప్రామాణ్యతను కానీ కోల్పోలేదు, అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి, ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి.
ధరమ్ పాల్ ఎప్పుడూ అందరికీ ఇలా చెప్తూ, తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెబుతూ ఉండేవాడు.

ఒకరోజు ఒక స్నేహితుడు అతనితో “మీ నాన్న అంత శక్తిమంతుడైతే, ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు, ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు?”

ధరమ్ పాల్ మాట్లాడుతూ, "మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు, ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవని నేను చెబుతున్నాను."

ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వలన, అందరూ అతనికి 'తండ్రి ఆశీర్వాదం' అని వెనుకగా గేలి చేసినా పట్టించుకోలేదు, తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు.

మరికొన్ని సంవత్సరాల్లో తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి.

*నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను, నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరమ్ పాల్ కుతూహలపడ్డాడు*.
ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు.

*ధరమ్ పాల్ విజయాన్ని, డబ్బుని చూసుకొని చాలా గర్వపడుతున్నాడని,* ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అని అనుకున్నాడు.

భారతదేశం నుండి లవంగాలను కొనుగోలు చేసి, వాటిని ఆఫ్రికాలోని జాంజిబార్‌కు రవాణా చేసి విక్రయించమని సలహా ఇచ్చాడు.
ధరమ్ పాల్ కు ఈ ఆలోచన నచ్చింది. జాంజిబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అవి అక్కడ నుండి భారతదేశంలోకి దిగుమతి చేయబడతాయి, ధర కూడా 10-12 రెట్లు అమ్ముడవుతుంది. వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే కచ్చితంగా నష్టమే.

తన తండ్రి ఆశీర్వాదాలు అతనికి ఎంతవరకు సహాయపడతాయో చూడడానికి ధరమ్ పాల్ దీనిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు.

నష్టాన్ని అనుభవించడానికి, అతను భారతదేశంలో లవంగాలను కొని, వాటిని ఓడలో నింపి, స్వయంగా జాంజిబార్ ద్వీపానికి తీసుకెళ్లాడు.

జాంజిబార్ లో ధరమ్ పాల్ ఓడ దిగి, వ్యాపారులను కలవడానికి పొడవైన ఇసుక దారిపై నడవడం ప్రారంభించాడు. అవతలి వైపు నుండి సైనికులతో పాటు కాలినడకన వస్తూ, సుల్తాన్ లాగా కనపడుతున్న వ్యక్తిని చూశాడు. వారంతా భారీ జల్లెడలను తీసుకువెళ్తున్నారు.
ఎవరని వాకబు చేయగా ఆయన స్వయంగా సుల్తాన్ అని చెప్పారు.

సుల్తాన్ కి ఎదురుపడి ధరమ్ పాల్ నమస్కరించి "నేను భారతదేశంలోని గుజరాత్‌లోని ఖంభాట్ నుండి వ్యాపారిని, వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చాను."

సుల్తాన్ అతనితో తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు.
సుల్తాన్‌తో వినయంతో వందలాది మంది సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు?” అని అడిగాడు.

సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు, “ నేను ఈ ఉదయం సముద్రతీరాన్ని సందర్శించడానికి వచ్చాను, ఇక్కడ ఎక్కడో నా వేలి నుండి ఉంగరం జారిపడిపోయింది. ఇప్పుడు, ఈ ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం, కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను. వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు.

ఆ ఉంగరం చాలా ఖరీదైనదని అయ్యుండాలి ధరమ్ పాల్ అన్నాడు.

అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు, “నా దగ్గర దానికంటే చాలా విలువైన, లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి, కానీ ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం.

ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్ చాలా ధృడంగా, సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను, కాబట్టి నా మనస్సులో ఆ ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ!”.

అప్పుడు, సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడటం ప్రారంభించి, “అయితే, ఈసారి ఏ వస్తువులు తెచ్చావు?” అని అడిగాడు.
" లవంగాలు", అన్నాడు ధరమ్ పాల్.




అన్నమయ్య_సూక్తులు_సామెతలు.pdf
962.8Кб
అన్నమయ్య సూక్తులు - సామెతలు.pdf




ఆదర్శాలు ఆచరణీయాలు.pdf
2.5Мб
ఆదర్శాలు ఆచరణీయాలు.pdf




శ్రీరామకృష్ణ ప్రభ.pdf
18.7Мб
శ్రీరామకృష్ణ ప్రభ.pdf




భక్తి.pdf
33.1Мб
భక్తి.pdf




హిందూ ధర్మం.pdf
23.8Мб
హిందూ ధర్మం.pdf




స్వాతి.pdf
36.6Мб
స్వాతి.pdf




Employment News.pdf
26.2Мб
Employment News.pdf




బతుకమ్మ.pdf
8.9Мб
బతుకమ్మ.pdf




సోపతి.pdf
10.0Мб
సోపతి.pdf

Показано 20 последних публикаций.