FactCheck.AP.Gov.in


Kanal geosi va tili: Hindiston, Telugucha


Official Account of Fact Check Wing of Government of Andhra Pradesh

Связанные каналы

Kanal geosi va tili
Hindiston, Telugucha
Statistika
Postlar filtri




– జగనన్న వసతి దీవెన కింద 5.06 లక్షల మందికిపైగా ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.834 కోట్లు అందించింది. 83వేలమంది ఎస్టీ విద్యార్థుల తల్లులకు రూ.135 కోట్లను వారి ఖాతాల్లో జమచేసింది. జగనన్న విద్యాదీవెన కింద రూ.5.4 లక్షలమంది ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.2,081 కోట్లు అందించింది. 1.11 లక్షలమంది ఎస్టీ విద్యార్థుల తల్లులకు రూ.346 కోట్లు ఈ పథకం కింద అందాయి.
– గతంలో ఎన్నడూ లేని విధంగా మనబడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఈ ప్రభుత్వం ఆధునికీకరించింది. ప్రభుత్వ పాఠశాలలన్నీ సర్వాంగ సుందరంగా మారుతున్నాయి. ఇప్పటికే 15వేల స్కూళ్లలో పనులు జరిగాయి.
– కనీస ప్రమాణాలు పాటించని, నిబంధనలు పాటించిన స్కూళ్లకూ బెస్ట్‌ అవైలబుల్‌ స్కీంను గత ప్రభుత్వంలో అమలు చేశారు. ఇప్పుడు ఈ స్కూళ్ల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో, డిజిటల్‌ చదువులు అందుతున్నాయి.
– బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలతో, డిక్షనరీ, యూనిఫారం, షూలతో విద్యాకానుక అందిస్తున్నారు.
– 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నారు.
– టోఫెల్‌ లాంటి కోర్సులను ప్రభుత్వం ఈ పిల్లలకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.
– ఇటీవలే ప్రభుత్వం జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకాలను ప్రకటించింది. మెయిన్స్‌కు అర్హత సాధిస్తే రూ.1 లక్ష , ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయినవారికి అదనంగా రూ.50వేల చొప్పున ప్రోత్సాహకాలను వెల్లడించింది. ప్రతి ఏటా వీటిని అందిస్తుంది.
– ఈ పథకాలన్నీ అత్యంత పారదర్శకంగా, అవినీతికి చోటు లేకుండా అమలవుతున్నాయి.

హాస్టళ్ల రూపురేఖలు మార్చిన ప్రస్తుత ప్రభుత్వం:
– సంక్షోభంలో వసతి గృహాలు ఉన్నట్టుగా ఈనాడు మరో వక్రీకరణకు దిగింది. వాస్తవం ఏంటంటే.. రాష్ట్ర విభజన తర్వాత 168 సోషల్‌ వెల్ఫేర్‌ స్కూళ్లు రాష్ట్రంలో ఉన్నాయి. వీటికి మరో 21 స్కూళ్లను అదనంగా చేర్చారు. ఇందులో 15 స్కూళ్లు 2019 ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు చేర్చారు. ఆ స్కూళ్లకోసం ఎలాంటి భూమినీ సేకరించలేదు. ఫీజిబిలిటీ రిపోర్టులు కూడా తీసుకోలేదు. కేవలం కాగితాల మీద మాత్రమే మంజూరుచేశారు.
– ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్‌ వెల్ఫేర్‌ స్కూళ్లలో మరమ్మతులకోసం ఇప్పటికే రూ.64.33 కోట్లు ఖర్చు చేసింది. 39 సివిల్‌ వర్కుల కోసం మరో రూ.133.90 కోట్లు ఖర్చు చేసింది. ఈ భవనాలన్నీ నిర్వహణలోకి వచ్చాయి.
– 177 స్కూళ్లలో నాడు –నేడు పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేసింది, దాదాపు రూ.318 కోట్లు దీనికోసం ఖర్చు చేయనుంది.


స్వయం ఉపాధి:
– గత ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాల కింద 2,02,414 మంది ఎస్సీ, ఎస్టీలకు రూ.2,726 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
– ఈ ప్రభుత్వ హయాంలో మునుపెన్నడూ లేని విధంగా 23,17,558 మంది ఎస్సీలకు ఆసరా, చేయూత పథకాల ద్వారా రూ.7,075.29 కోట్లు, 4,72,018 మంది ఎస్టీలకు రూ.1,392 కోట్లు మేర లబ్ధి జరిగింది.

ఎస్సీలకు జీవనోపాధి కోసం వాహనాలు:
ఎస్సీ లబ్ధిదారుల స్థిరమైన జీవనోపాధి, ఆర్థిక అభ్యున్నతి కోసం పౌర సరఫరాల కార్పొరేషన్‌ ద్వారా 2020–21లో రాష్ట్ర ప్రభుత్వం రూ.133.67 కోట్లతో 2,300 మందికి ఫోర్‌ వీలర్‌ మినీ ట్రక్‌ మొబైల్‌ డిస్పెన్సరి యూనిట్‌ వాహనాలను పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ డోర్‌ డెలివరీ కోసం అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ స్వయం ఉపాధి పథకం కింద 1,038 యూనిట్లతో రూ.63.20 కోట్లతో అమలు చేసింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్లు:
– గత ప్రభుత్వంలో ఎస్సీ పెన్షనర్లు 8,66,835 మంది మాత్రమే. వారికి నెలకు రూ.1000 చొప్పున ఖర్చు చేసిన మొత్తం రూ.4,415 కోట్లు.
– కానీ ఈ ప్రభుత్వం నెలకు రూ.2,750 పెన్షన్‌ ఇస్తోంది. మొత్తం లబ్ధిదారులు 12,15,030. వీరికోసం చేసిన వ్యయం రూ.14,418 కోట్లు. అంటే గతంలో కంటే మూడున్నర రెట్లు ఎక్కువ. మొత్తం పెన్షన్లకు చేస్తున్న వ్యయంలో ఇది 18.41 శాతం.
– ఇక ఎస్టీల విషయానికొస్తే గత ప్రభుత్వం 3,01,242 మందికి రూ.1373 కోట్లు మాత్రమే వెచ్చించింది.
– కానీ వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వం 3,94,753 మందికి రూ.4,694 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది గతంలో కంటే మూడున్నర రెట్లు ఎక్కువ. మొత్తం పెన్షన్లకు చేస్తున్న వ్యయంలో ఇది 6 శాతం.

యాజమాన్య హక్కులు కల్పించిన సీఎం వైయస్‌ జగన్‌:
– భూమి కొనుగోలు పథకం ఎత్తివేశారంటూ ఈనాడు దినపత్రిక తన కథనంలో పేర్కొంది. అయితే గత ప్రభుత్వం ఈ పథకానికి ఎంతమేర భూమి సేకరించిందో కూడా రాస్తే బాగుండేది. అప్పుడు అసలు ఈ పథకాన్ని ఎవరు ఎత్తేశారో ప్రజలందరికీ సులభంగా అర్థం అవుతుంది.
– దశాబ్దాల కింద భూమి కొనుగోలుకోసం ఎస్సీ కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకున్న ఎస్సీల భూమి ఇప్పటికీ తనఖాలో ఉండిపోయింది. వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వం ఎస్సీలు తీసుకున్న అలాంటి రుణాలన్నింటినీ రద్దుచేసి, వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. ఎస్సీల జీవితాల్లో ఇది మైలురాయి.
– 14.223 మంది దళిత మహిళలకు 16,213 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభించాయి. మరో 3,57,085 మంది ఎస్సీలకు, 1,20,477 మంది ఎస్టీలకు అసైన్డ్‌ భూములపై ఈ ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించింది.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇళ్లు, ఇళ్ల స్థలాలు:
– ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణాల రీత్యా గత ప్రభుత్వం ఒక్క సెంటు భూమి కూడా కొనుగోలు చేయలేదు.
– కానీ వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా దళితులకు, ఎస్టీలకు బాసటగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 31 లక్షలకుపైగా ఇళ్లపట్టాలు ఇస్తే అందులో 6,36,732 మంది లబ్ధిదారులు దళిత వర్గాల అక్క చెల్లెమ్మలే. ఆయా కుటుంబాలకు రూ.10,949 కోట్ల లబ్ధి చేకూర్చింది.
– వారికోసం చేస్తున్న 4,18,646 ఇళ్ల నిర్మాణ రూపంలో మరో రూ.10,949 కోట్ల లబ్ధి చేకూరుతోంది. 1,41,496 మంది ఎస్టీ అక్కచెల్లెమ్మలు ఉన్నారు.
– ఇంత భారీస్థాయిలో దళితులకు ఏ ప్రభుత్వమూ అండగా నిలబడలేదు.

విదేశీ విద్యకు చేయూతనిస్తున్న వైయస్‌ జగన్‌ ప్రభుత్వం:
– నాణ్యమైన విద్యకు తిలోదకాలు అంటూ ఈనాడు మరో కట్టుకథ రాసింది. విదేశీ విద్యా పథకం రద్దు అయిందని, బెస్ట్‌ అవైలబుల్‌ పథకం లేదని ప్రచురించింది.
– గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యాపథకంలో లోపాలను, అవినీతిని, అక్రమాలను ఈ ప్రభుత్వం గుర్తించి ఆ స్థానంలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తీసుకు వచ్చింది.
– ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా, ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు సాధించిన వారికి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించేలా పథకాన్ని సమున్నతంగా తీర్చిదిద్ది అమలు చేస్తోంది.
– 21 కోర్సుల్లో క్యూఎస్‌ ర్యాంకింగ్‌ లేదా టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంక్‌ల ప్రకారం 50 ఉత్తమ ర్యాంకులు గల విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు లేదా ట్యుషన్‌ ఫీజు 100% చెల్లించేలా పథకాన్ని గొప్పగా మార్చి అమలు చేస్తున్నారు.
– మిగిలిన వర్గాలకు రూ.కోటి గానీ లేదా అసలు ట్యూషన్‌ ఫీజు (ఏది తక్కువ అయితే అది) చెల్లిస్తున్నారు.
– ఈ స్థాయిలో విదేశీ విద్యకోసం గత ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోయింది.

అమ్మ ఒడి, నాడు – నేడు, విద్యాకానుక... ఒకటా రెండా:
– పిల్లలంతా బడిలో ఉండాలనే ఏకైక ధ్యేయంతో 8,84,131 మంది ఎస్సీ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి కింద రూ.15వేల చొప్పున రూ.5,335.7 కోట్లు ఇప్పటివరకూ అందించింది. 2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి కింద రూ.1,714.75 కోట్లు అందించింది.


‘మాటలు స్వీటు.. చేతలు చేటు’ అంటూ 01–12–2023న ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది.
కేవలం వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వంమీద బురద జల్లడం అనే ఏకైక కార్యక్రమంలో నిండా మునిగిపోయిన ఈనాడు దినపత్రిక మరింతగా దిగజారిపోయింది.
ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ఎస్సీ, ఎస్టీల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. ఈ వాస్తవాలు దాచిపెట్టి, గౌరవ ముఖ్యమంత్రి గారిపై నేరుగా కామెంట్లు చేస్తూ అవాస్తవ కథనాన్ని ఈనాడు దినపత్రిక ప్రచురించింది.
ఎస్సీల అభివృద్ధి, సంక్షేమానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది.
అందువల్లే ఎస్సీ కాంపొనెంట్‌ అమల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్‌ కింద చేసిన ఖర్చు కన్నా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో చేసిన ఖర్చు అధికంగా ఉంది.
– గత ప్రభుత్వం ఐదేళ్లకాలంలో ఎస్సీలకోసం ఖర్చుచేసిన మొత్తం బడ్జెట్‌ రూ.33,625.49 కోట్లు. ఎస్టీల కోసం చేసింది రూ.12,487.48 కోట్లు.
– కానీ వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వం ఇప్పటివరకు ఎస్సీల కోసం చేసిన ఖర్చు రూ.61,596.77 కోట్లు, ఎస్టీల కోసం చేసింది రూ.19,617.85 కోట్లు.
ఎస్సీ, ఎస్టీలకు ఎవరు అన్యాయం చేశారో... ఎవరు మేలు చేశారో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం.

దళితులను చిన్నచూపు చూసిన గత పాలకులు:
– ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగినప్పుడు ఈనాడు దినపత్రిక ఏ రోజూ రాయలేదు. ఈ ప్రభుత్వం రాకముందు ముందు గత ఐదేళ్లలో పరిస్థితులను ఈ సందర్భంగా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి.
– ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు?’ అంటూ ఏకంగా ప్రభుత్వ పెద్ద స్వయంగా వ్యాఖ్యానించి దళితులపట్ల తనకున్న అభిప్రాయాలను మీడియా సమావేశాల్లోనే ఎలాంటి సంకోచం లేకుండా బయటపెట్టారు.
– అప్పటి మంత్రివర్గంలోని ఒక సభ్యుడు కూడా దళితులనుద్దేశించి మరిన్ని అతి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దళితులు శుభ్రంగా ఉండరని, వారికి చదువుకూడా రాదని, కానీ వారు సూపరింటెండెంట్లు అయిపోతారంటూ వ్యంగ్యంగా, హేళన చేస్తూ వ్యాఖ్యానించారు.
– ‘రాజకీయాలు మీకెందుకురా?’ అంటూ పరుష పదజాలంతో మరో అధికార పార్టీ ఎమ్మెల్యే దళితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి.
ఇలాంటి మాటలతో దళితుల మనసులను తీవ్రంగా గాయపరిచారు గత పాలకులు.

దళితులను ఇబ్బంది పెట్టిన గత పాలకులు:
– రాజధానిగా గత ప్రభుత్వం ప్రకటించిన అమరావతి ప్రాంతంలో దళితులను భయపెట్టి, వారికోసం ప్రభుత్వం ఇచ్చిన భూములను తక్కువ ధరకే కొనుగోలు చేసి, వారిని దారుణంగా దెబ్బతీసిన వైనంపై దర్యాప్తులోనే భయంకర వాస్తవాలు వెలుగుచూశాయి.
– వ్యవసాయ భూమి ఉన్న దళితులకు కనీసం మోటారు కనెక్షను కూడా ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టారు.
– ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల పేరుతో పారదర్శకతకు పాతరేసి, అయినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టి, దళితుల పేరుమీద అక్రమాలకు పాల్పడ్డారు.
ఇప్పుడు ఈ వ్యవహారాలన్నింటిపైనా కేసులు నడుస్తున్నాయి.

దళితులపై తీవ్ర భారం మోపిన గత పాలకులు:
– ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేయడంద్వారా అంతిమంగా పేదలు, దళితులపై భారం మోపారు. చదువులు, వైద్యం కొనే స్థోమత లేక వారు మంచి చదువులకు, మంచి వైద్యానికి దూరమయ్యారు.
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి పథకానికి గత ప్రభుత్వం బకాయిలు పెట్టడం వల్ల ఆయా విద్యాసంస్థల్లో తీవ్ర వేదనకు గురైనవారిలో అధికులు దళితులే.
– కనీసం దళిత పేద కుటుంబాలు ఇల్లు కట్టుకునేందుకు ఒక్క ఎకరం కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేదు. కాని ఇవేవీ ఈనాడు దినపత్రికలో ఏరోజూ రాయలేదు.

ఎస్సీ కాంపొనెంట్‌ అమల్లో ఏపీ నంబర్‌వన్‌:
అలాంటి పరిస్థితులను తొలగిస్తూ వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ మెరుగైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎస్సీ, ఎస్టీలకోసం చేపట్టింది. అందువల్లే ఎస్సీ కాంపొనెంట్‌ అమల్లో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.
– ఎస్సీ కాంపొనెంట్‌ ద్వారా దేశ వ్యాప్తంగా 12.41 లక్షల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటైతే, ఒక్క మన రాష్ట్రంలోనే 8.54 లక్షల సంఘాలు ఏర్పాటయ్యాయి.

ఈ ప్రభుత్వంలో సంతృప్తస్థాయిలో, పారదర్శకంగా లబ్ధి:
– కులాల కార్పొరేషన్లు నిర్వీర్యం అంటూ ఈనాడు ఒక పచ్చి అబద్ధాన్ని తన కథనంలో రాసింది. గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన ఎస్సీలు, ఎస్టీల సంఖ్య పరిమితం. ఏదైనా కార్యక్రమం చేస్తే ఎప్పుడూ సంతృప్తస్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందిన పాపానపోలేదు. అరకొరగా అబ్ధి అందుతున్న వారుకూడా అవినీతి కారణంగా దోపిడీకి గురయ్యారు.
– కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా సంతృప్తస్థాయిలో, పారదర్శకంగా అమలు జరిగాయి.
– గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నేరుగా వారి ఇంటివద్దకే చేర్చే వ్యవస్థను ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది. నేరుగా వారి ఖాతాల్లోకే డీబీటీ ద్వారా చేరింది.




ఈ పథకం ఖర్చు రూ.568 కోట్లు కాగా, సింహభాగం వైయస్సార్‌గారి హయాంలో రూ.340 కోట్లు, వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వ హయాంలో రూ.146 కోట్లు ఖర్చుపెట్టి టన్నెల్స్‌లోని సంక్లిష్టమైన ఫాల్ట్‌ జోన్‌లను ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో పూర్తి చేయడం జరిగింది.
– ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా అవుకు టన్నెల్‌ నుండి 20 వేల క్యూసెక్కుల నీటిని 30–11–2023న విడుదల చేస్తున్నాం.

ప్రయోజనాలు
– శ్రీశైలం కుడి గట్టు కాలువ కింద 1.5 లక్షల ఎకరాలకు నీటి సరఫరా జరుగుతుంది.
– గాలేరు నగరి సుజల స్రవంతి పథకం కింద గండికోట, వామికొండ, సర్వారాయ సాగర్, మైలవరం, పైడిపాలెం తదితర రిజర్వాయర్లకు రోజుకి ఒక టీఎంసీ చొప్పున అదనపు నీటి సరఫరా జరుగుతుంది.
– తద్వారా కరువు ప్రాంతమైన రాయలసీమలోని 2.21 లక్షల ఎకరాలకు నీటి సరఫరా, 1.77 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది.

వేగంగా జరుగుతున్న ఆవుకు టన్నుల్‌ – 3 పనులు:
– ప్రస్తుతం ఉన్న టన్నెల్‌కు అదనంగా మూడో టన్నెల్‌ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. కృష్ణా నదిలో వరద నీరు ప్రవహించే అతి తక్కువ రోజుల్లో తాగునీరు, సాగునీరు కొరతలేకుండా చూసేందుకు ఈ ప్రభుత్వం రూ.1,298 కోట్లతో పనులు చేపట్టింది.
– కొత్తగా ప్రారంభించనున్న 20వేల క్యూసెక్కులకు అదనంగా గోరకల్లు రిజర్వాయర్‌ నుండి 10,000 క్యూసెక్కులు కలిపి మొత్తం 30,000 క్యూసెక్కుల వరద జలాలను రాయలసీమ ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

ఈనాడు కథనం నిండా అసత్యాలే:
– అవుకు టన్నెళ్ళ ద్వారా నీరు వదిలే రైతు ప్రయోజన కార్యక్రమం మీద బురదజల్లేందుకు ఈనాడు తప్పుడు రాతలు రాసింది.
– ప్రస్తుతం వేసిన పంటల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా అవుకుకు నీరు వదులుతున్నారని ఈనాడు రాయడం హాస్యాస్పదం.
– శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ) ఆయకట్టు కింద వేసిన పంటలు అవుకు రిజర్వాయర్‌ కింద కూడా ఉన్నాయి. కానీ అవుకు రిజర్వాయర్‌కు నీరు వదలడంలో ఎస్సార్బీసీ ఆయకట్టు దెబ్బతింటుంది అంటూ ఈనాడు అడ్డగోలుగా, పూర్తి పక్షపాత ధోరణితో తప్పుడు రాతలు రాసింది.
– గోరకల్లులో ఉన్న రిజర్వాయర్‌ నీటిని ఎంతో ప్రణాళికాబద్ధంగా విడుదల చేస్తూ పంటలు ఎండిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది.
– ఎస్సార్బీసీ ఆయకట్టు ప్రయోజనాలను కాపాడేందుకు అవుకు రిజర్వాయర్‌
పైభాగంలో అలాగే కింది భాగంలో బ్యాలన్స్‌ చేస్తూ గోరకల్లు నుండి నీరు విడుదల చేయడం జరుగుతుంది.
– ప్రభుత్వం సీమ పథకాల పట్ల చిత్తశుద్ధితో ఈరోజు సంక్లిష్టమైన ఫాల్ట్‌ జోన్‌ పనులు పూర్తి చేసి సీమ రైతుల మోములో వెలుగులు నింపే పనిచేస్తోంది.
– ఈ ప్రభుత్వం హయాంలో ఒక్కొక్క నీటిపారుదల పథకాన్ని క్రమ పద్ధతిలో ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయడం ఈనాడు భరించలేకపోతోంది. అందుకు ఉదాహరణే సీమ రైతుల పాలిట వరప్రసాదిని అయిన అవుకు టన్నెల్‌ పథకం మీద ఈరోజు ఈనాడు రాసిన విషపూరిత, తప్పుడు రాతలు.


‘సీఎం మెప్పెకోసం నీటి మళ్లింపు’ అంటూ 28–11–2023న ఈనాడు పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవం. లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించి, పక్షపాత ధోరణితో ఇలాంటి అసత్యాలతో కథనం ప్రచురించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది.

పతాకస్థాయికి చేరిన ఈనాడు అసహనం:
ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తున్నకొద్దీ ఈనాడు దినపత్రిక అసహనం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ మంచి కార్యక్రమాలను కూడా తప్పుబడుతూ అవాస్తవాలతో కథనాలు రాస్తోంది. రాయలసీమలో కరువు ప్రాంతాలకు అత్యంత కీలకమైన అవుకు టన్నెల్‌ పూర్తైన సందర్భంలో ‘సీఎం మెప్పెకోసం నీటి మళ్లింపు’ అంటూ ఈనాడు రాసిన కథనం ఈ ప్రభుత్వంమీద ఈనాడు దినపత్రికకు ఉన్న అసూయ, ద్వేషాలకు తార్కాణం.

చేయలేక చేతులెత్తేసిన గత ప్రభుత్వం:
రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ అయిన గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్‌) పథకంలోని వరద కాలువ ద్వారా ఈరోజు వరకు కేవలం 10,000 క్యూసెక్కులు మాత్రమే పంపగలుగుతున్నారు. గత ప్రభుత్వం రెండవ (కుడి) టన్నెల్‌ నిర్మాణ పనులను చేయలేక చేతులెత్తేసింది. అత్యంత క్లిష్టమైన ఫాల్ట్‌ జోన్‌లో (బలహీనమైన రాతిపొరల ప్రాంతం) పనులు వదిలేసింది. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు, వెలిగొండ టన్నెల్స్‌ వంటి పనుల్లో ఇదే తంతు కనిపిస్తుంది.

జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన మాజీ సీఎం వైయస్‌ఆర్‌
ఒకసారి అవుకు టన్నెళ్ళ పనుల వివరాల్లోకి వెళ్తే... దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ గుండా తీసుకోగలిగిన 9,000 క్యూసెక్కుల నీరు రాయలసీమ ప్రాంత అవసరాలకు ఏమాత్రం సరిపోవని గుర్తించారు. కృష్ణా నదిలో వరద ప్రవహించే రోజులు క్రమంగా తగ్గిపోవడంతో పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్కుల వరద నీరు తీసుకొనే విధంగా, అలాగే జీఎన్‌ఎస్‌ఎస్‌ కింద గోరకల్లు రిజర్వాయర్‌ నుండి 20,000 క్యూసెక్కుల నీరు అవుకు రిజర్వాయరుకు తీసుకొని పోయే విధంగా జలయజ్ఞం కింద ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు.
– అవుకు టన్నెల్‌–2 (కుడి టన్నెల్‌–2)ను 20,000 క్యూసెక్కులతో 2007వ సంవత్సరంలో 570.83 కోట్లతో జీఓ నంబర్‌ 206, తేదీ 18.11.2006 కింద పరిపాలనా అనుమతి ఇచ్చారు.
– ఈ టన్నెల్‌ 16 మీటర్ల వ్యాసంతో, 5.70 కి.మీ. పొడవుతో జీఎన్‌ఎస్‌ఎస్‌ వరద కాలువ ద్వారా అవుకు రిజర్వాయరుకు తీసుకొని పోయే పనిని చేపట్టారు.

రెండు టన్నెల్స్‌ నిర్మించాలన్న నిపుణులు:
– అయితే, కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు.. రాతిపొరలు బలహీనంగా ఉన్నందువల్ల ఒక పెద్ద టన్నెల్‌ బదులుగా రెండు మళ్లింపు టన్నెల్స్‌ నిర్మించాల్సిందిగా సూచించారు.
– వారి సూచనల మేరకు రెండు సొరంగాలను 11 మీటర్ల వ్యాసంతో చేపట్టి, మట్టి పని 2010 నాటికి దాదాపు పూర్తి చేశారు.
– ఎడమ టన్నెల్‌లో 350 మీటర్లు, కుడి టన్నెల్‌లో 180 మీటర్ల మేర ఫాల్ట్‌ జోన్‌ పనులు మిగిలిపోయాయి. రాతి పొరలు బలహీనంగా ఉండి, సొరంగం పైకప్పు జారి పడిపోవడంతో అక్కడ పనుల పురోగతిలో పీటముడి ఏర్పడింది.
– ఈ ఫాల్ట్‌ జోన్‌లో పనిచేయడం దాదాపు అసాధ్యం కావడంతో, గండికోట రిజర్వాయర్‌కు అత్యవసరంగా నీరు సరఫరా చేయాల్సి రావడంతో కుడి టన్నెల్‌ ఫాల్ట్‌ జోన్‌ నుండి రెండు మళ్లింపు టన్నెల్స్‌ను 7 మీటర్ల వ్యాసంతో ఒక్కొక్కటి 5,000 క్యూసెక్కుల సామర్థ్యంతో పూర్తి చేశారు.

రాయలసీమ అవసరాలను దృష్టిలో పెట్టుకొని..:
– కుడి టన్నెల్‌లో ఫాల్ట్‌ జోన్‌ పనులు చేయడం దాదాపు అసాధ్యం కావడంతో, ఈ ప్రభుత్వం రాయలసీమ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమీక్ష జరిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గోరకల్లు రిజర్వాయర్‌ నుండి అవుకు రిజర్వాయర్‌కు 20,000 క్యూసెక్కుల నీటి సరఫరా జరగాలని అధికారులకు దిశా నిర్దేశం చేసి, ఫాల్ట్‌ జోన్‌లో 180 మీటర్ల మేర పనులను చేపట్టడానికి రూ.126 కోట్లతో 12–03–2020న పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది.
– పనులు చేపట్టగానే గతంలో పెట్టిన రిబ్స్‌ విరిగిపోయి టన్నెల్‌ రూఫ్‌ వాలిపోవడంతో ఒక నిపుణుల కమిటీని నియమించారు.
– వారి సూచన మేరకు అత్యాధునిక పద్ధతులు అయిన ఫోర్‌ పోలింగ్, అంబ్రెల్లా రూఫ్‌ మెథడ్, పాలీ యురెథేన్‌ గ్రౌటింగ్‌ పద్ధతుల్లో ఫాల్ట్‌ జోన్‌ టన్నెల్‌ను నిర్మించాలని సూచనలు చేశారు.
– ఎన్నో అవాంతరాలను అధిగమించి, క్రమ పద్ధతిలో 160 మీటర్ల ఫాల్ట్‌ జోన్‌ని జూన్‌ 2023 కల్లా పూర్తి చేయడం జరిగింది.
– దాంతో ఇప్పటికే రెండు మళ్లింపు టన్నెల్స్‌ ద్వారా జరుగుతున్న 10,000 క్యూసెక్కులకు అదనంగా మరో 10,000 క్యూసెక్కుల నీటిని గోరకల్లు రిజర్వాయర్‌ నుండి అవుకు రిజర్వాయర్‌కు.. మొత్తంగా 20,000 క్యూసెక్కుల నీరు అనగా రోజుకు 2 టీఎంసీల వరద నీటిని రాయలసీమ ప్రజలకు గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా తరలించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

మొత్తం రూ.568 కోట్లు వ్యయం:




- కడప జిల్లా వాసులు వ్యాపారాలు చేయకూడదన్నట్టు ఈనాడు దినపత్రిక పదే పదే రాయడం వారి సంకుచిత తత్వానికి నిదర్శనం. టెండర్ల ప్రక్రియలో దేశంలో ఎవరైనా, విధానాలకు లోబడి పాల్గొనవచ్చు. టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించడం జరిగింది. ఎక్కడా కూడా టెండర్ల ప్రక్రియలో తప్పు జరగలేదు అని ఈనాడు వారికి కూడా విదితమే అని అందరికీ తెలుసు. ఇటువంటి వార్తలు రాయడం ద్వారా ఈనాడు దినపత్రిక... పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తోంది.


“జగన్ మార్క్ స్మార్ట్ టెండర్!” అనే శీర్షికన 24-11-2023న ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవం. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది.

సీఎం జగన్ గారి ముందుచూపుతో...:
- జీఓ నంబర్ 22, తేదీ 01-09-2020 ప్రకారం డిస్కమ్ లను రైతులకు స్మార్ట్ / ఐ ఆర్ డీ ఏ మీటర్ పెట్టమని ప్రభుత్వం ఆదేశించింది. గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముందుచూపుతో... రైతులకు 9 గంటల పగటి పూట విద్యుత్ సరఫరా చేయడం, వ్యవసాయ విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టి డీబీటీ విధానం ద్వారా అమలుచేయడం కోసం ఆదేశించారు. రైతులకు ప్రమాదాలు జరగకుండా, మీటర్లు కాలిపోకుండా, మోటర్ల భద్రతని, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ భద్రతని దృష్టిలో పెట్టుకొని ఆగ్జిలరీ మెటీరియల్స్ పెట్టాలని ఆదేశించారు. రైతులు పీవీసీ వైర్‌లను వాడటంతో ఎండకు ఎండి, ఇన్సులేషన్ దెబ్బతిని, ఎర్తింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల రైతులు ప్రమాదాలకు గురై చనిపోవడం జరుగుతోంది. ఎంసీసీబీని అందుబాటులోనికి తేవడం వల్ల వ్యవసాయ మోటార్ కు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ కు, ముఖ్యంగా రైతుకు భద్రత అధికంగా ఉంటుంది. డిస్కమ్ లు డబ్ల్యుపీసీ వైర్లు వినియోగించడం వల్ల అన్ని కాలాలకి అనుగుణంగా పని చేసే వెదర్ ప్రూఫ్ కేబులు, ఎర్త్ పైప్ పెట్టడం జరిగింది. తక్కువ వోల్టేజ్, ఇండక్టివ్ లోడ్ వల్ల మోటార్లు కాలిపోవడం జరగకుండా అరికట్టడం కోసం కెపాసిటర్ ను డిస్కమ్ లు ప్రతిపాదించాయి. ఆగ్జిలరీ మెటీరియల్స్ పెట్టడం వల్ల రైతులకు మోటర్లు కాలిపోకుండా, డిస్కమ్ లకు ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోకుండా అధిక మొత్తంలో లాభం చేకూరుతుంది. డీబీటీని అమలు చేయడం వల్ల రైతుకు కచ్చితంగా ఎంత విద్యుత్ వాడుకున్నదీ తెలుస్తుంది, డిస్కమ్ ల బాధ్యత కూడా పెరుగుతుంది.

ప్రజలపై ఎటువంటి భారం వేయలేదు:
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టెండర్ తయారుచేసి 5 సంవత్సరాలకు (60 నెలల్లో) కేపెక్స్ అండ్ ఓపెక్స్ మోడల్ లో జుడీషియరీ ప్రివ్యూకు పంపడమైనది. జుడీషియరీ ప్రివ్యూలో టెండర్ డాక్యుమెంట్ పెట్టి ప్రజల సలహాలు, అభ్యంతరాలను 15 రోజుల వ్యవధిలో సేకరించడం జరిగింది. సలహాలు, అభ్యంతరాలను సేకరించిన తరువాత వాటికి తగిన సమాధానాలు ఇచ్చి టెండర్ డాక్యుమెంట్ ఇ - ప్రొక్యూర్ మెంట్ ద్వారా టెండర్లను పిలవడం జరిగింది. తరువాత ఎల్ 1బిడ్డర్ కు టెండర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియ కోవిడ్- 19 సమయంలో జరగడం వల్ల... సంస్థలు, ఫ్యాక్టరీలు మూతపడి ఉండడం వల్ల, రేట్లు అధికంగా ఉండడం వల్ల... టెండర్ వేల్యూ అధికంగా రావడం గమనించిన ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ రద్దు చేయమని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టెండర్ రద్దు చేయడం జరిగింది. రీ టెండరింగ్ ద్వారా టెండర్లను పిలవడం వల్ల టెండర్ల ధర మొదటి సారి కంటే ఈసారి 15.75 శాతం తగ్గాయి. స్మార్ట్ మీటర్‌లకు సంబంధించి ప్రజలపై ఎటువంటి భారం వేయలేదు.

డిస్కమ్ లకు 2% ఆదా:
- ముఖ్యంగా 60 నెలలకు ప్రాజెక్ట్ ఎరక్షన్, నిర్వహణ.. భారత ప్రభుత్వం స్మార్ట్ మీటర్స్ ఎస్ బీ డీ ద్వారా స్మార్ట్ మీటర్ల ఎరక్షన్ కు 27 నెలలు, నిర్వహణ 93 నెలలకు పెంచడం జరిగింది. దీనివల్ల మీటర్ గ్యారంటీ పిరియడ్‌ నిర్వహణ 10 సంవత్సరాలకు పెరిగింది. నిర్వహణా సమయం పెంచడం వల్ల డిస్కమ్ లకు 2% ఆదా అవుతుంది.

మంత్రి పెద్దిరెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం:
'ధరలు తగ్గించడం అంటే ఇదేనా పెద్ది రెడ్డి?' అంటూ ఈనాడు చెప్పింది అవాస్తవం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కోసం 27 నెలలు, నిర్వహణ 93 నెలలకు పెంచడం జరిగింది. దీని వలన రూ.3086.29 కోట్లు అదనపు భారం పెరిగింది అనడం తప్పు. దీని వల్ల డిస్కామ్ లకు 2% ఆదా అవుతుంది. షిరిడీ సాయి, అదాని లాంటి పెద్ద సంస్థలు పోటీ పడటం వల్ల ఈ ప్రాజెక్టుకు సరైన ధర వచ్చింది. స్మార్ట్ మీటర్ల విధానం దేశంలోనే మొట్టమొదటగా మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నాం. ఇంతవరకు దేశంలో ఎక్కడా వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెట్టలేదు.
- వ్యవసాయ సంబంధిత స్మార్ట్ మీటర్లు దూరందూరంగా పెట్టడం వల్ల కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్ల నిర్వహణ కూడా టెండర్ వేసిన వారే భరించాలి. ఇక్కడ వ్యవసాయ సంబంధిత స్మార్ట్ మీటర్లు కాలిపోయినా, దొంగతనానికి గురైనా టెండర్ రూల్స్ ప్రకారం వారి సొంత ఖర్చుతో తిరిగి స్మార్ట్ మీటర్లు అమర్చాలి.

ఇదెక్కడి పోలిక 'ఈనాడు'?:
- దేశంలో ఇంత వరకు వ్యవసాయ సంబంధిత స్మార్ట్ మీటర్లు ఏ రాష్ట్రంలోనూ పెట్టలేదు. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని అర్బన్ ఏరియాలోని స్మార్ట్ మీటర్ విధానంతో పోల్చడం, ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం ఈనాడు వారి ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది. ఏదైనా వ్యవస్థను మరో వ్యవస్థతో పోల్చడానికి అవి రెండూ సమానమైన వ్యవస్థలు అయి ఉండాలి.




'క్వార్ట్‌జ్ కొల్లగొట్టారు' అంటూ 23-11-2023న ఈనాడు దినపత్రికలో ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవం. ఈనాడు కథనంలో ఆరోపించినట్లు దేవుడి మాన్యంలో ఎటువంటి మైనింగ్ కార్యకలాపాలు జరగడం లేదు. అసలు మైనింగే జరగనప్పుడు.. ఏకంగా 50 వేల టన్నుల క్వార్ట్‌జ్ తవ్వారనే ఆరోపణలు పూర్తిగా అర్థరహితం. కనీసం వాస్తవాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులను కూడా ఈనాడు వారు సంప్రదించకపోవడం సమంజసం కాదు. ఇటువంటి తప్పుడు రాతలపై ఈనాడు మీద ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.

- పల్నాడు జిల్లా కారంపూడి మండలం సింగరుట్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల్లో క్వార్ట్‌జ్ తవ్వకాలకు మైనింగ్ శాఖ ఎటువంటి అనుమతులు మంజూరు చేయలేదు. 2012లో దేవాదాయశాఖ ఈ ఆలయ పరిధిలోని బ్లాక్ 28 ప్రాంతంలో పది ఎకరాల భూమిని రమాదేవి అనే వ్యక్తికి మైనింగ్ కార్యకలాపాల కోసం లీజుకు ఇచ్చింది. సదరు వ్యక్తి మైనింగ్ శాఖ నుంచి లీజు అనుమతులు పొందారు. అయితే 2022లో ఈ మైనింగ్ అనుమతులను గనుల శాఖ రద్దు చేసింది.

- 2021లో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చెందిన ఇరవై అయిదు ఎకరాల భూమిని మైనింగ్ కార్యకలాపాల కోసం వినియోగించుకునేందుకు దేవాదాయశాఖ అధికారులు వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఇరువురు వ్యక్తులు 12.5 ఎకరాల చొప్పున దక్కించుకున్నారు. అయితే క్వార్ట్‌జ్ తవ్వకాల కోసం సదరు వ్యక్తులు మైనింగ్ అధికారులకు ఎటువంటి దరఖాస్తు చేయలేదు. ఈ ప్రాంతంలో క్వార్ట్‌జ్ మైనింగ్ లీజులను గనులశాఖ జారీ చేయలేదు.

- వాస్తవాలు ఇలా ఉంటే... పల్నాడుకు చెందిన ప్రజాప్రతినిధి క్వార్ట్‌జ్ మైనింగ్ పేరుతో దోపిడీ చేశారని 'ఈనాడు' పత్రిక తన కథనంలో ఆరోపించడం విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో జరగని మైనింగ్ నుంచి.. ఏకంగా 50 వేల టన్నులకు పైగా తవ్వకం, ఎగుమతి కూడా జరిగిపోయినట్లు తన కథనంలో పేర్కొనడం పూర్తిగా అవాస్తవం. అసలు మైనింగ్ అనుమతులే ఇవ్వకపోతే... మైనింగే జరగకపోతే... ప్రభుత్వానికి రాయల్టీ ఎలా వస్తుంది? కేవలం ఊహాత్మక ఆరోపణలతో ప్రభుత్వానికి రాయల్టీ దక్కలేదంటూ ఈనాడు పత్రిక అభూత కల్పనను తన పత్రికలో అచ్చేసింది.

- రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాకు విజిలెన్స్ స్వ్కాడ్ లను ఏర్పాటు చేసింది. మైనింగ్ పై ఎక్కడ ఆరోపణలు వచ్చినా ఈ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే అన్ని చోట్ల చెక్ పోస్ట్ లు కూడా ఏర్పాటు చేసి మైనింగ్ అక్రమ రవాణాను అడ్డుకుంటున్నాం. ఇంత పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ఉంటే.. పెద్ద ఎత్తున క్వార్ట్‌జ్ అక్రమ మైనింగ్, రవాణా అంటూ ఈనాడు పత్రిక తప్పుడు కథనం రాసింది.
ఇటువంటి తప్పుడు కథనాలను ప్రచురిస్తూ ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కల్పించేందుకు ఈనాడు పత్రిక ప్రయత్నిస్తోంది.




గొట్టిపాటి రవికుమార్ కు సంబంధించిన ఫ్యాక్టరీలకు తాళాలు వేసిన అంశంతో గనులశాఖకు ఏం సంబంధం? రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వారి క్వారీల్లో అక్రమాలు జరిగితే, దానిపై చర్యలు తీసుకోవడం కక్షసాధింపు చర్యలని ఈనాడు పత్రిక ఎలా నిర్ధారిస్తుంది? ప్రతి సందర్భంలోనూ ఈ ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కల్పించేలా, వాస్తవాలకు విరుద్ధంగా, అసత్యాలను పోగుచేసి వార్తాకథనాలు రాయడం ఈనాడు పత్రికకు పరిపాటిగా మారింది. ఇలాంటి తప్పుడు కథనాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.


'రాబందుల రాజ్యహింస' అంటూ 22-11-2023న ఈనాడు దినపత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. 'వైకాపాలో చేరలేదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ని వెంటాడిన ఫ్యాక్షన్ నైజం' అంటూ రాజకీయపరమైన దురుద్దేశాలను గనులశాఖకు, ప్రభుత్వానికి ఆపాదించేందుకు 'ఈనాడు'  ప్రయత్నించడం దారుణం. గనులశాఖ, తద్వారా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీయాలన్నదే ఈ కథనం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

-ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా... ప్రభుత్వ విభాగాలు మాత్రం చట్టానికి అనుగుణంగానే పనిచేస్తాయి. రాష్ట్రంలో క్వారీలను తనిఖీ చేయడం, వాటిల్లో ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే, నిబంధనల ప్రకారం వాటిపై చర్యలు తీసుకోవడం అనేది గనులశాఖ సాధారణ విధుల్లో భాగం. రాష్ట్రంలో మైనింగ్ రంగంలో ఉన్న లీజుదారులతో మాత్రమే గనులశాఖకు సంబంధం ఉంటుంది తప్ప, వారి రాజకీయ ప్రాధాన్యతలతో గనులశాఖకు ఎటువంటి సంబంధం ఉండదు. క్వారీ అనుమతులు పొందిన వారు వివిధ రాజకీయ పక్షాలకు చెందిన వారు ఉన్నప్పటికీ నిబంధనల వర్తింపు అందరికీ ఒకేరకంగా ఉంటుంది. ఇందులో కొందరికి ప్రత్యేక రాయితీలు, మరికొందరికి కక్ష సాధింపులు ఉంటాయనే ఉద్దేశంతో ఈనాడు పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించడం దారుణం. 

నిబంధనలను ఉల్లంఘించినందు వల్లే..:
- 2019లో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రానైట్ క్వారీలపై గనులశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన పలు క్వారీలపై జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లాలోని గొట్టిపాటి రవికుమార్ కు చెందిన 11 క్వారీలపై కూడా తనిఖీలు జరిగాయి. ఆయా క్వారీల నిర్వాహకులు, సిబ్బంది సమక్షంలోనే ఈ తనిఖీలు జరిగాయి. గొట్టిపాటి రవికుమార్ కు చెందిన క్వారీ తనిఖీల సమయంలో వారి మేనేజర్లు, సిబ్బంది కూడా ఉన్నారు. తనిఖీల్లో అనుమతి లేకుండా క్వారీయింగ్ చేయడం, ఇతర నిబంధనలను ఉల్లంఘించిన విషయం నిర్ధారణ అయ్యింది. తనిఖీ నివేదిక ప్రకారం రూ.45 కోట్ల మేర ఉల్లంఘన చేసినట్లు గుర్తించి, చట్ట ప్రకారం దానికి 5 రెట్లు కలిపి మొత్తం రూ.270 కోట్లు జరిమానా విధించడం జరిగింది. 
-గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని మిగిలిన క్వారీలకు ఏ విధంగా జరిమానాలు విధించామో, అదే విధంగా గొట్టిపాటి రవికుమార్ క్వారీలకు కూడా జరిమానాలు విధించడం జరిగింది. ఇందులో ఎటువంటి కక్షసాధింపునకు ఆస్కారం లేదు. ఈ జరిమానా నోటీసులపై ఆయా క్వారీల నిర్వాహకులు తమ వివరణను గనులశాఖకు సమర్పించడం, ప్రభుత్వం నిర్వహించే రివిజన్ కు తమ జరిమానాను తగ్గించాలని లేదా రద్దుచేయాలని కోరుతూ అప్పీలు చేసుకోవడం సర్వసాధారణం. ఈరెండు జిల్లాల్లోని పలు క్వారీల నిర్వాహకులు ఇదే విధంగా రివిజన్ కు అప్పీలు చేసుకున్నారు. 

రవికుమార్ సంస్థలు అప్పీలు చేయలేదు:
- గొట్టిపాటి రవికుమార్ కు చెందిన 11 సంస్థలు మాత్రం నోటీసులు అందుకున్న తరువాత ఎటువంటి రివిజన్ కు అప్పీలు చేయలేదు. ఆధారాల సహా తన వాదనను వినిపించుకోవచ్చు కానీ అలా చేయలేదు.
- అదే క్రమంలో మరోవైపు గొట్టిపాటి రవికుమార్ నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. తన సంస్థలపై అన్యాయంగా జరిమానాలు విధించారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గౌరవ న్యాయస్థానం గనులశాఖ నోటీసులను కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ గనులశాఖ హైకోర్ట్ లో రిట్ అప్పీల్ చేసింది. దానిని విచారించిన గౌరవ న్యాయస్థానం గనులశాఖ చర్యలను సమర్థించింది.  దీనిపై మళ్ళీ గొట్టిపాటి రవికుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్ట్‌ కూడా పరిశీలన చేయాలనే చెప్పింది. 

-వాస్తవాలు ఇలా ఉంటే, ఈనాడు దినపత్రిక మాత్రం గొట్టిపాటి రవికుమార్ క్వారీలను కావాలనే మూయించి, మిల్లులకు తాళాలు వేశారని, ఆయన వందల కోట్ల రూపాయల మేర నష్టపోయేలా ప్రణాళిక వేశారంటూ అర్థంలేని అంశాలతో తప్పుడు కథనాన్ని వండి వార్చింది.

ఏ లెక్కల ఆధారంగా ఈనాడు చెప్పింది?
వాస్తవానికి ప్రకాశం జిల్లాలోని మొత్తం 240 క్వారీల నుంచి గనులశాఖకు ఏడాదికి రూ.400 కోట్ల మేర రెవెన్యూ వస్తోంది. 2015 నుంచి ఇప్పటి వరకు ఈ రెవెన్యూ ఎక్కడా తగ్గలేదు. ఒక్క గొట్టిపాటి రవికుమార్ 11 సంస్థలు పనిచేయకపోవడం వల్ల ఏటా రూ.100 కోట్ల రెవెన్యూను ప్రభుత్వం నష్టపోయిందని 'ఈనాడు' పత్రిక ఏ లెక్కల ఆధారంగా తన కథనంలో రాసిందో అర్థం కావడం లేదు. అంతేకాదు జరిమానాలు విధించిన ఆ 11 క్వారీల నుంచి ఎప్పుడూ ఏడాదికి రూ.100 కోట్ల రెవెన్యూ వచ్చిన దాఖలాలే లేవు. అలాంటిది 'ఈనాడు' పత్రిక తన ఊహలతోనే లెక్కలు వేసి ప్రభుత్వం భారీగా రెవెన్యూను నష్టపోయిందని అసత్యపు కథనాలను రాయడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. 

- గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్న వారు తమ క్వారీలకు సంబంధించి ఇబ్బందులు ఎదురైతే ఇతర క్వారీల నుంచి స్టోన్స్ కొనుగోలు చేసి తమ ఫ్యాక్టరీలను నడుపుకొంటూ ఉంటారు.




‘అస్మదీయుల బ్రాండ్ల ధరలు తగ్గించు.. వారి ఆదాయం పెంచు’ అంటూ ఈనాడు దినపత్రికలోనూ, ‘ఆ కిక్కు ఎవరి ఖాతాలోకి?’ అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలోనూ 21–11–2023న ప్రచురించిన కథనాలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. వీటిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది.
రాష్ట్రంలో మద్యం ధరలపై పన్నుల విధానాన్ని ప్రభుత్వం ఇటీవల హేతుబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వం చాలా స్వల్పంగా ఏఆర్‌ఈటీ, ఏఈడీ/ఏసీడీ , వ్యాట్‌ పన్నులతోపాటు స్పెషల్‌ మార్జిన్‌ను సవరించింది. అన్ని బ్రాండ్ల మద్యం ఉత్పత్తుల బేసిక్‌ ధరపై పన్నుల శాతాన్ని నిర్ణయిస్తూ పన్నుల విధానంలో ఏకరూపత తీసుకొచ్చింది. దీనివల్ల అతికొద్ది బ్రాండ్ల ధరలు మాత్రమే స్వల్పంగా పెరిగాయి. అత్యధిక బ్రాండ్ల ధరలు యథాతథంగానే ఉన్నాయి. మొత్తం మీద ఆదాయం చాలా స్వల్పంగా పెరిగినట్లు కనిపిస్తున్నా అత్యధిక బ్రాండ్ల మద్యం ధరల్లో మాత్రం మార్పులేదు.

ఆ బ్రాండ్లు మార్కెట్‌లో లేవు:
– అస్మదీయుల బ్రాండ్ల ధరలు పెరగలేదంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో ప్రచురించిన మద్యం బ్రాండ్లు అసలు మార్కెట్‌లో లేనేలేవు. సంబంధిత కంపెనీలు ఆ మద్యం బ్రాండ్లను రెన్యువల్‌ చేసుకోలేదు. ఆ కంపెనీల మద్యం నిల్వలు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో హోల్‌సేల్, రిటైల్‌ మద్యం దుకాణాల్లో ఆ బ్రాండ్ల నిల్వలు దాదాపుగా లేవు. ఆ బ్రాండ్లు, వాటి ధరలు కేవలం కాగితాల మీదనే కనిపిస్తున్నాయి తప్ప మార్కెట్‌లో అస్సలు అందుబాటులో లేవు. కానీ, ఆ బ్రాండ్ల ధరలు పెరగనే లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రయత్నించాయి.
– రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్ల గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి దిన పత్రికలు కనీసం ప్రస్తావించలేదు. ఎందుకంటే ఆ బ్రాండ్ల మద్యం ధరలు ఏమాత్రం పెరగలేదు కనుక. ఆ విషయాన్ని ప్రజలకు తెలియకుండా ఉండేందుకే ఆ బ్రాండ్ల పేర్లను ఈ పత్రికలు ఉద్దేశపూర్వకంగా విస్మరించాయి.

అందుబాటులో ఉన్న వాటి ధరలు పెరగలేదు:
– ఎంఎస్‌ బయోటెక్, ఈగిల్‌ డిస్టిలరీ, ఎస్‌పీవై ఆగ్రో ప్రైవేట్‌ లిమిటెడ్, శర్వాణీ ఆల్కోబ్రూ ప్రైవేట్‌ లిమిటెడ్, ఎస్‌ఎన్‌జే షుగర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఉత్పత్తి చేసే మద్యం బ్రాండ్లకు సంబంధించి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వాటి ధరలు పెరగలేదు. ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్‌లో అందుబాటులో లేని ఆ కంపెనీల బ్రాండ్ల ధరలే స్వల్పంగా పెరిగాయి.
– ఉదాహరణకు... కింగ్‌ఫిషర్‌ స్ట్రాంగ్‌ ప్రీమియం బీర్, ఎస్‌ఎన్‌జే 10000 సూపర్‌ స్ట్రాంగ్‌ బీర్‌ ధరల గురించి ఈ దినపత్రికలు ప్రధానంగా రాశాయి. నిజానికి ఈ రెండు బ్రాండ్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌లో దాదాపు అందుబాటులో లేనేలేవు.

దశలవారీగా మద్య నియంత్రణలో భాగంగా...:
– పన్నులను హేతుబద్ధీకరించడంతో అతికొద్ది కంపెనీల లీటర్‌ సైజు లిక్కర్‌ బాటిళ్ల ధరలు మా­త్రమే చాలా స్వల్పంగా తగ్గాయి. నిజానికి రాష్ట్రంలో ఒక లీటరు, అంతకంటే పెద్ద పరిమాణంలో మద్యం బాటిళ్ల ఉత్పత్తి, అమ్మకాలు కేవలం నామమాత్రమే.
– ఇక మద్యం కంపెనీల పెండింగ్‌ బిల్లుల విషయానికొస్తే ప్రభుత్వం దాదాపుగా వాటిని చెల్లించేసింది. ఇటీవల రూ.175 కోట్లు చెల్లించడంతో దాదాపుగా బకాయిలన్నీ తీరిపోయాయి.
– కొన్ని కంపెనీలకు మద్యం ఉత్పత్తులపై కేసుకు రూ.250 చెల్లించమన్నారంటూ ఈ దినపత్రికల్లో రాసిన రాతలు పూర్తిగా అవాస్తవం. అత్యంత పారదర్శక విధానంలో ప్రభుత్వం మద్యం కంపెనీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విధానమైన.. దశలవారీగా మద్య నియంత్రణను కచ్చితంగా పాటిస్తూ ప్రభుత్వం ఈ మద్యం కొనుగోళ్లు చేపడుతోంది.
అందువల్ల ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. ప్రభుత్వం వీటిని తీవ్రంగా ఖండిస్తోంది.




– ఇటీవలి సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా ఉల్లిపాయలు, టమాటాల ధరలు చాలాసార్లు భారీగా పెరిగిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే. ఇలా వీటి ధరలు కొండెక్కిన ప్రతిసారీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వీటిని రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలకే విక్రయించింది.
ఒక్క ఉల్లిపాయల విషయానికే వస్తే.. 2019 నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.69.10 కోట్ల విలువైన 9462.49 టన్నుల ఉల్లిపాయలను సేకరించి రైతు బజార్లలో విక్రయించింది. రాష్ట్ర ప్రజలు ఇబ్బందిపడకుండా చూసింది.

దేశంలో తొలిసారిగా
పీడీఎస్‌ ద్వారా చిరు ధాన్యాల పంపిణీ
ప్రస్తుతం రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలకు మద్దతు ధర కంటే మార్కెట్‌ రేటు ఎక్కువగా ఉంది. ఇవి ఆరోగ్యానికి మంచివి కావడంతో ఉన్నత, మధ్య తరగతి కుటుంబాలు వీటిని తమ ఆహారంలో భాగం చేసుకోవడంతో వీటికి డిమాండ్‌ పెరిగింది. కానీ ఈ వినియోగానికి తగినంతగా ఉత్పత్తులు లేకపోవడంతో చిరుధాన్యాల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సమస్యను అధిగమించి, పేదలకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పీడీఎస్‌ ద్వారా రాగులు, జొన్నల పంపిణీ చేపట్టింది.
–ఈ ఏడాది మే నుంచి రాయలసీమలో కార్డుదారులకు జొన్నలు, రాగులను సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు 3,303 టన్నుల జొన్నలు, 13,052 టన్నుల రాగులను అందించింది.
– అలాగే రైతులు పండించిన జొన్నలు, రాగులను వారి నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి, వాటిని పీడీఎస్‌లో ప్రజలు అందించనుంది.
ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా చిరుధాన్యాలు పండించే రైతులు మంచి ధరలు పొందుతున్నారు.


‘నిప్పుల్లా నిత్యావసరాలు’ అంటూ 20–11–2023న ఈనాడు దినపత్రిక ప్రచురించిన కథనం నిండా పూర్తిగా వక్రీకరణలు, అవాస్తవాలే.
‘అయిదేళ్ల కిందటితో పోలిస్తే బియ్యం, ఉప్పు, పప్పులు తదితర సరకుల రూపంలోనే నెలకు రూ.1000 నుంచి 1500 వరకు అదనంగా ఖర్చవుతోంది’ అంటూ ఈనాడు దినపత్రిక అసంబద్ధమైన ఆరోపణలు చేసింది.
వాస్తవానికి.. ఐదేళ్లతో పోలిస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలూ పెరిగాయన్నది సామాన్యులకు కూడా తెలిసిన విషయం. కానీ ధరల పెరుగుదల కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రమే జరిగినట్టు ఈనాడు దినపత్రిక రాసింది.

జాతీయ స్థాయిలో కంటే మన రాష్ట్రంలోనే తక్కువ:
ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన వాస్తవం ఏంటంటే... జాతీయ స్థాయిలో కంటే మన రాష్ట్రంలోనే వివిధ నిత్యావసరాల ధరలు తక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో చూస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.
ఇందులో కొన్ని నిత్యావరాల ధరల వివరాలు చూస్తే...
– జాతీయ స్థాయిలో కిలో సాధారణ బియ్యం ధర రూ.43.17 ఉంటే మన రాష్ట్రంలో సగటున ధర రూ.39.84 మాత్రమే ఉంది.
– జాతీయంగా సన్‌ఫ్లవర్‌ నూనె ధర రూ.123.61 ఉంటే మన రాష్ట్రంలో రూ.112.86 మాత్రమే ఉంది. అలాగే వేరుశెనగ నూనె జాతీయంగా రూ.192.69 ఉంటే మన రాష్ట్రంలో రూ.172.77 ఉంది. పామాయిల్‌ ధరలు కూడా జాతీయ స్థాయి ధరల కంటే మన రాష్ట్రంలోనే తక్కువగా ఉన్నాయి.
– పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టమాటా... ఇలా ఏది తీసుకున్నా జాతీయ స్థాయి ధరలకంటే ఆంధ్రప్రదేశ్‌లోనే తక్కువగా ఉన్నాయి.

వంట్‌ గ్యాస్‌ ధర
ఇక ఈనాడు ఆరోపించినట్టు వంట గ్యాస్‌ ధర ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే పెరిగిందన్నది పూర్తిగా అవాస్తవం. ఈ ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నది దేశ వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ ధరను రాష్ట్ర ప్రభుత్వం పెంచేసింది అంటూ ఈనాడు రాయడం పూర్తిగా అసంబద్ధం.

అనేక కారణాలు
నిజానికి ధరల పెరుగుదల రవాణా రంగంపై ప్రభావం చూపించే బొగ్గు, గ్యాస్, ముడి చమురు వంటి ఇంధనాలపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని నియంత్రించలేవు. గత కొన్ని సంవత్సరాలుగా వీటి ధరలు అంతర్జాతీయంగా, దేశీయంగా పెరుగుతున్నాయన్న సంగతి సామాన్యులకు కూడా తెలిసిందే. వీటి ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలూ పెరుగుతున్నాయి.
అలాగే ద్రవ్యోల్బణం, కరవు, పెరుగుతున్న పట్టణీకరణ వంటి అంశాల వల్ల కూడా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి.
ఇది ఒక్క మన రాష్ట్రంలోనే కాదు... దేశవ్యాప్తంగా జరుగుతోంది. కానీ ఇదేదో కేవలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రమే జరిగిపోతున్నట్టు.. దేశంలో మరెక్కడా ధరల పెరుగుదలే లేనట్టు ఈనాడు తప్పుడు కథనాలు రాస్తోంది.

ప్రతి ఏటా పెరుగుతున్న మద్దతు ధరలు
దేశ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలు పెరగడానికి మరో కారణం.. ప్రతి ఏటా ఆయా పంటల మద్దతు ధరలు పెరగడమే. నిజానికి ఇలా మద్దతు ధరలు పెరగకపోతే అంతిమంగా తీవ్రంగా నష్టపోయేది అన్నదాతలే.

ఎన్నో చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం
పెరుగుతున్న ధరల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది.
– ధరల నియంత్రణలో భాగంగా తాజాగా రైతు బజార్లలో సూపర్‌ఫైన్‌ బియ్యం, కందిపప్పు విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 8,990 క్వింటాళ్ల బియ్యం, 1206 క్వింటాళ్ల కందిపప్పును తక్కువ ధరకే విక్రయించింది.
– 1.48 కోట్ల కార్డుదారులకు ప్రతినెలా 5 కిలోల నాణ్యమైన ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలోని 4.31 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోంది.
– కందిపప్పును కూడా సబ్సిడీపై కిలో కేవలం రూ.67కే పంపిణీ చేస్తోంది. గడిచిన 4 నెలలుగా సరుకు అందుబాటులో లేకపోవడంతో సరఫరాకు అవరోధం ఏర్పడింది.
నవంబర్‌ నుంచి మళ్లీ పంపిణీ మొదలుపెట్టింది. డిసెంబరు నెలలో 5000 టన్నుల కందిపప్పును సరఫరా చేయనుంది. ఇకమీదట కందిపప్పు సరఫరాలో జాప్యం లేకుండా స్థానిక రైతుల ద్వారా కందులు కొనుగోలు చేసి ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
– కేంద్ర ప్రభుత్వ ధరకంటే దాదాపు సగం తక్కువ ధరకు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఫోర్టిఫైడ్‌ గోధుమ పిండిని సరఫరా చేస్తోంది. కేంద్రం భారత్‌ బ్రాండ్‌ పేరుతో కిలో గోధుమ పిండిని రూ.27.50కి ఇస్తున్నట్టు ప్రకటించింది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల కిందటి నుంచే... ఫోర్టిఫైడ్‌ గోధుమ పిండిని కిలో కేవలం రూ.16కే అందిస్తోంది. మార్కెట్‌ ధర అధికంగా ఉన్నప్పటికీ ఇంత తక్కువ ధరతోనే ఇప్పటి వరకు 10,625 టన్నుల గోధుమ పిండిని మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. డిసెంబర్‌లోనూ ఫోర్టిఫైడ్‌ గోధుమ పిండిని పంపిణీ చేయనుంది.

20 ta oxirgi post ko‘rsatilgan.

1 709

obunachilar
Kanal statistikasi