TRS Party


Kanal geosi va tili: Hindiston, Telugucha
Toifa: Siyosat


Bharat Rashtra Samithi (BRS Party), an Indian political party founded by Sri KCR.

Связанные каналы

Kanal geosi va tili
Hindiston, Telugucha
Toifa
Siyosat
Statistika
Postlar filtri


చలో ఖమ్మం... రేపే బీఆర్‌ఎస్‌ తొలి భారీ బహిరంగ సభ

ఖమ్మం వేదికగా శంఖారావం పూరించబోతున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.

#BRSforIndia #AbkiBaarKisanSarkar


తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ...

హైదరాబాద్‌లో ఏర్పాటుకానున్న ప్రపంచ ఆర్థిక వేదికకు చెందిన నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం (సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌ - సీ4ఐఆర్‌). దావోస్‌లో మంత్రి కేటీఆర్‌ గారి సమక్షంలో జరిగిన అవగాహన ఒప్పందం.
#TelanganaAtDavos #WEF23


మీకు, మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు

#HappyKanuma


ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

Wishing you all a very Happy Makara Sankranti.

#MakaraSankranti


మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు

Wishing you all a very #HappyBhogi


ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి దంపతుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో ఘనంగా గోదాదేవి కళ్యాణం.

పవిత్ర హృదయంతో శ్రీ రంగనాథుని నిత్య పూలమాలతో సేవించి, ఆ శ్రీవారికే తన జీవితాన్ని అర్పించిన మహా భక్తురాలు గోదాదేవి కళ్యాణ మహోత్సవం, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగింది.

వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కళ్యాణ మహోత్సవం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, శోభమ్మ దంపతుల ఆధ్వర్యంలో ఆనందోత్సాహాల నడుమ కన్నుల పండుగగా కొనసాగింది.

హిందూ సంప్రదాయం ప్రకారం..
ప్రతి ఏడాది ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు సాగే శ్రీ ఆండాళ్ అమ్మ వారి తిరుప్పావై పాశురాల పఠనం అనంతరం, గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది.

ఈ కార్యక్రమంలో సీఎం గారి సోదరీమణులు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత శ్రీ గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ లో వారి కుమారుడు శ్రీ శిశిర్ గమాంగ్ తదితరులున్నారు.


దేశమంతా చైనా మాల్‌... కేంద్ర బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏటా భారీగా పెరుగుతున్న దిగుమతులు. మోదీ సర్కారు ఆర్భాటం తప్ప, ఆచరణలో ఘోరంగా విఫలమైన మేకిన్‌ ఇండియా పథకం.


మాజీ కేంద్ర మంత్రి, ఆర్‌జేడీ నేత శరద్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.

తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి శ్రీ శరద్ యాదవ్ అందించిన మద్దతును సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Chief Minister Sri K. Chandrashekar Rao has condoled the death of former Union Minister, RJD leader Sri Sharad Yadav.

Hon'ble CM recalled Sri Sharad Yadav's support to the Telangana Statehood movement. Expressed his deepest condolences to the bereaved family members.


Video oldindan ko‘rish uchun mavjud emas
Telegram'da ko‘rish
మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.


తెలంగాణపై తమ వివక్షను కొనసాగిస్తున్నకేంద్ర బీజేపీ ప్రభుత్వం... హైదరాబాద్‌లోని జనపనార (జ్యూట్‌) బోర్డు ప్రాంతీయ కార్యాలయం తరలింపు. ఇప్పటికే హ్యాండ్‌లూమ్ బోర్డు రద్దు... కొత్తవి ఇవ్వకుండా, ఉన్నవి రద్దు చేస్తూ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతున్న కేంద్రం.


నేడు మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పర్యటనకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారికి స్వాగతం.. సుస్వాగతం

నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను ప్రారంభించనున్న సీఎం శ్రీ కేసీఆర్.


భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాత శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.

Greetings on the occasion of #NationalYouthDay celebrated on the birthday of great philosopher & social reformer #SwamiVivekananda.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్రీమతి ఎ. శాంతి కుమారిని నియమించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి శాంతి కుమారి బాధ్యతలు చేపట్టారు.

తనకు సీఎస్ గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్ లో సీఎం శ్రీ కేసీఆర్ ను కలిసి శ్రీమతి శాంతి కుమారి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం శ్రీమతి శాంతి కుమారికి శుభాకాంక్షలు తెలిపారు.


వ్యవసాయ సేవల రంగంలో విదేశీ పెట్టుబడుల్లో తెలంగాణ టాప్‌...

అక్టోబర్, 2019 నుండి సెప్టెంబర్, 2021 వరకు 49 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు ఆకర్షించి 17 రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన మన తెలంగాణ.

#TriumphantTelangana


రాజన్న సిరిసిల్ల జిల్లా, కొదురుపాకలో తన తాతయ్య జోగినిపల్లి కేశవ రావు, అమ్మమ్మ లక్ష్మీ బాయి జ్ఞాపకార్థం సొంత నిధులతో నిర్మించే పాఠశాల భవనానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు.



17 ta oxirgi post ko‘rsatilgan.

1 955

obunachilar
Kanal statistikasi