తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel


Channel's geo and language: India, English


తిరుమల సమాచారం. https://www.youtube.com/laxmitelugutech

Related channels  |  Similar channels

Channel's geo and language
India, English
Statistics
Posts filter


🙏 Om Namo Venkatesaya 🙏

17-10-2024

Total pilgrims - 58,637

Tonsures: 21,956

Hundi kanukalu : 3.69 Cr

Waiting Compartments..26

Approx. Darsan Time for Sarvadarshanam (without SSD Tokens)…12-15H

(SSD / DD)Time slot Sarvadarshan... 3 to 4 H

Rs 300 Special Darshan Approx. Time... 2 to 3 H

Tq.
------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి గంటల సమయం 10 పడుతుంది, అంటే అది SSDటోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 10 గంటలు అని.

ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం వుంది, సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
👉 @TtdLatestUpdates' rel='nofollow'>https://www.youtube.com/@TtdLatestUpdates

👉 https://t.me/LaxmiTeluguTech

👉 https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g


SSD Tirupati & Srivarimettu Tokens Present Availability Status.

---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g


Issuance of Srivari Mettu SSD Tokens has started, Current Status of Tokens.

శ్రీవారి మెట్టు SSD టోకెన్‌ల జారీ ప్రారంభమైంది, టోకెన్‌ల ప్రస్తుత స్థితి.

Note: Live tickets status may vary by the time pilgrim reaches physically at the counters. Pilgrims are waiting in the Q-line to take the tokens. Tickets will be issued on first-come-first-service basis


SSD Tokens Present availability Status

SSD Tokens Status Updates 👇

👉WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g


Offline Accommodation availability information at the CRO, Tirumala, as of 02:45AM today.


SSD Tokens:- తిరుపతిలో ఉదయం 1.45 / 2 గంటల నుంచి ఉచిత దర్శనం టోకెన్లు ఇస్తారు, ఇచ్చు ప్రదేశాలు

🔔 శ్రీనివాసం - RTCబస్టాండ్ దగ్గర తిరుపతి

🔔 విష్ణు నివాసం -రైల్వే స్టేషన్ ఎదురుగా తిరుపతి

🔔 భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి దగ్గర తిరుపతి

⚜ శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ఉదయం 5.45 / 6.00 నుండి ఆ నడకదారిలో ఇస్తారు.

Note: ON Alipiri Steps Tokens will Not be Given
------

SSD - TIRUPATI - OPENING COUNT
STARTS FROM 1.45 / 2 AM - SRINIVASAM + VISHNUNIVASAM + BHUDEVI COMPLEX

DD - SRIVARI METTU - OPENING COUNT
STARTS FROM 5.45 / 6 AM ON 50TH STEP
TICKET SCANNING COMPULOSRY ON 1250 STEP

Note: Bring Original Aadhar or printout with clearly identifiable photo. Softcopy in mobile Not allowed.
--------------

SSD Tokens Status Updates 👇

👉WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

👉 Telegram group:- https://t.me/LaxmiTeluguTech

👉 Telegram Channel :- https://t.me/LaxmiTeluguTechChannel

👉Youtube Channel :-@LaxmiTeluguTech' rel='nofollow'>https://www.youtube.com/@LaxmiTeluguTech


SSD Tokens:- తిరుపతిలో ఉదయం 2 గంటల నుంచి ఉచిత దర్శనం టోకెన్లు ఇస్తారు, ఇచ్చు ప్రదేశాలు

🔔 శ్రీనివాసం - RTCబస్టాండ్ దగ్గర తిరుపతి

🔔 విష్ణు నివాసం -రైల్వే స్టేషన్ ఎదురుగా తిరుపతి

🔔 భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి దగ్గర తిరుపతి

Note: ON Alipiri Steps Tokens will Not be Given
------

SSD - TIRUPATI - OPENING COUNT
STARTS FROM 2 AM - SRINIVASAM + VISHNUNIVASAM + BHUDEVI COMPLEX

Note: Bring Original Aadhar or printout with clearly identifiable photo. Softcopy in mobile Not allowed.
--------------

SSD Tokens Status Updates 👇

👉WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

👉 Telegram group:- https://t.me/LaxmiTeluguTech

👉 Telegram Channel :- https://t.me/LaxmiTeluguTechChannel

👉Youtube Channel :-@LaxmiTeluguTech' rel='nofollow'>https://www.youtube.com/@LaxmiTeluguTech


వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2024 అక్టోబ‌రు 17: తిరుమలలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ సీవీఎస్వో శ్రీ శ్రీధర్, తిరుప‌తి ఎస్పీ శ్రీ సుబ్బ‌రాయుడు, డిప్యూటీ ఈఓ శ్రీ భాస్క‌ర్‌, పేష్కార్ శ్రీ రామ‌కృష్ణ‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


వైభవంగా శ్రీ గోవింద రాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ

తిరుపతి, 2024 అక్టోబ‌రు 17: తిరుపతి శ్రీ గోవింద రాజస్వామివారి పౌర్ణమి గరుడసే గురువారం వైభవంగా జరిగింది. సాయంత్రం 6 గంటలకు సర్వాలంకార భూషితుడైన స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

వాహన సేవలో డిప్యూటీ ఈఓ శ్రీమతి శాంతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


👆తిరుమలలో ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి- టీటీడీ అడిషనల్ ఈఓ శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి

తిరుమల, 2024 అక్టోబ‌రు 17: తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అత్యవసరంగా ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అడిషనల్ ఈఓ శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో గురువారం సాయంత్రం టీటీడీ సీవీఎస్వో శ్రీ శ్రీధర్, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడలతో కలిసి టీటీడీ, విజిలెన్స్, పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఆయన తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఈఓ మాట్లాడుతూ తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీటీడీ, విజిలెన్స్, పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్, ఏపీఎస్ ఆర్టీసీ, టీటీడీ ఇంజినీరింగ్, రెవెన్యూ, ట్రాన్స్ పోర్ట్ జీఎంలు కమిటీ గా ఏర్పడి వారం రోజుల లోపు సమస్యలను గుర్తించి పరిష్కారానికి సలహాలు, సూచనలు అందివ్వాలన్నారు.

సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు

•⁠ ⁠తిరుమలలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే గోకులం, ఏటీసీ, రామ్ భగీచా వంటి ప్రాంతాలను గుర్తించాలి.

•⁠ ⁠వివిధ వర్గాల భక్తులు, ప్రైవేట్ వాహనాలు, ట్యాక్సీలకు సూచిక బోర్డులను, నిర్ధిష్టమైన పార్కింగ్ ను ఏర్పాటు చేయాలి.

•⁠ ⁠తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులకు టీటీడీ నుండి అదనపు సిబ్బందిని కేటాయించాలి.

•⁠ ⁠తిరుమలలో భవిష్యత్తులో చేపట్టే నిర్మాణాల్లో పార్కింగ్ సౌకర్యం తప్పనిసరి చేయడం, మల్టీ లెవెల్ పార్కింగ్ లను నిర్మించాలి.

•⁠ ⁠నిబంధనలను అతిక్రమించే ట్యాక్సీ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుని, అందరూ విధిగా నిబంధనలు పాటించేలా విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కల్పించాలి.

•⁠ ⁠ఎప్పటికప్పుడు ట్రాఫిక్, పార్కింగ్ అప్డేట్స్ వచ్చేలా మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలి.

ఈ కార్యక్రమంలో టీటీడీ రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, అడిషనల్ ఎస్పీ శ్రీ ఐ.రామకృష్ణ, వీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర, టీటీడీ, విజిలెన్స్, పోలీస్, ఆర్టీఏ, ఏపీఎస్ ఆర్టీసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




శ్రీ కోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం

తిరుపతి, 2024 అక్టోబ‌రు 17: తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో పౌర్ణ‌మి సంద‌ర్భంగా గురువారం అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 9 నుండి 10.30 గంటలకు అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయంలో ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ సురేష్‌, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




🙏 Om Namo Venkatesaya 🙏

16-10-2024

Total pilgrims - 75,371

Tonsures: 24,065

Hundi kanukalu : 4.21Cr

Waiting Compartments… 08

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).... 08H

(SSD / DD)Time slot Sarvadarshan... 3 to 4 H

Rs 300 Special Darshan Approx. Time... 2 to 3 H

Tq.

------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతుంది, అంటే అది ఎటువంటి టోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 06 గంటలు అని.

ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 06 నుంచి 08 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-

https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

https://t.me/LaxmiTeluguTech

@TtdLatestUpdates' rel='nofollow'>https://www.youtube.com/@TtdLatestUpdates




Offline Accommodation availability information at the CRO, Tirumala, as of 02:20AM today.








👆 భారీ వర్షం నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు

రేపు (17.10.24) శ్రీ వారి మెట్టు నడక మార్గం మూత

టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామలరావు


తిరుమల, 2024 అక్టోబ‌రు 16: భారీ వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని రేపటి వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామలరావు బుధవారం టీటీడీ ఉన్నతాధికారులతో వర్చువల్ గా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణ ప్రణాళికపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భారీ వర్షాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.

కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ కు అంతరాయం కలకగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ ముందస్తు జాగ్రత్తగా జనరేటర్ల కొరకు డీజిల్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఐటీ వింగ్ భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు.

వైద్య శాఖ అంబులెన్సు లను అందుబాటులో పెట్టుకుని సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లలో జేసీబీలను సిద్ధంగా ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ప్రజా సంబంధాల విభాగం వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటూ ఎస్వీబీసీ, సోషియల్ మీడియా ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇప్పటికే పాపవినాశనం, శిలా తోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ మార్గాల్లో రాకపోకలను టీటీడీ పునరుద్ధరించనుంది.

ఈ సమావేశంలో టీటీడీ అడిషనల్ ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్, సిఈ సత్య నారాయణ ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

20 last posts shown.