Фильтр публикаций


Instagram లో ఫేమస్ రిసిపి

బీట్రూట్ కంజి అనేది ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధమైన ప్రోబయోటిక్ డ్రింక్. ఇది ముఖ్యంగా పంజాబీ వంటకాల్లో కనిపించే ఆవిర్భావం. బీట్రూట్, క్యారెట్ , అవల పొడి, పింక్ ఉప్పు, నీళ్లు కలిపి ఫెర్మెంటేషన్‌ ద్వారా తయారు చేస్తారు.

బీట్రూట్ కంజి తయారీ విధానం

కావలసిన పదార్థాలు:

బీట్రూట్ – 2 (సన్నగా చీల్చిన ముక్కలు)
క్యారెట్ – 1 (చీల్చిన ముక్కలు)
నీళ్లు – 1.5 లీటర్లు
ఆవాల పొడి– 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – 1 టీ స్పూన్
పింక్ సాల్ట్ – రుచికి తగినంత
ఎండు మిరపకాయలు – 2 (మన ఇష్టం)

తయారీ విధానం:
1. బీట్రూట్, క్యారెట్‌ను చక్కగా కడిగి, చిన్న ముక్కలుగా కోయాలి.
2. ఒక గాజు జార్ తీసుకుని అందులో కోసిన కూరగాయలను వేయాలి.
3. అందులో ఆవాల పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపండి
4. వాటర్ పోసి చెక్క స్పూన్‌తో బాగా కలపాలి.
5. జార్‌ను మూతపెట్టకుండా పైపైగా ఒక క్లాత్‌తో కప్పి రబ్బర్ బ్యాండ్‌తో కట్టాలి.
6. గాలి పోసుకునేలా ఉంచి, 3-5 రోజులు గరిటపాయేలా ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలి.
7. రోజుకు ఒకసారి చెక్క స్పూన్‌తో కలిపితే ఫెర్మెంటేషన్ బాగా జరుగుతుంది.
8. 3-5 రోజుల తరువాత కంజి మృదువుగా పుల్లగా మారుతుంది.
9. స్ట్రెయిన్ చేసి కాంపోజిట్‌ను వదిలి, లిక్విడ్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేయండి.


వినియోగ విధానం:
రోజుకు ఒక లేదా రెండు గ్లాసులు తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
ఇది ప్రొబయోటిక్ డ్రింక్‌గా పనికి వస్తుంది, గటు హెల్త్‌కు(జీర్ణ వ్యవస్థ ) మేలు చేస్తుంది.
బ్లడ్ ప్యూరిఫికేషన్, హీమోగ్లోబిన్ పెంపు కోసం బాగా ఉపయోగపడుతుంది.

మీరు దీన్ని ట్రై చేసి, మీ అనుభవం చెప్పండి!






Paneer Bites : సాయంత్రం స‌మ‌యంలో వేడిగా ప‌నీర్‌తో ఇలా స్నాక్స్ చేసి తినండి.. టేస్ట్ చూస్తే వ‌ద‌ల‌రు..!

🥣 ప‌నీర్ బైట్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..
👉 ప‌నీర్ తురుము – 100 గ్రాములు
👉 శ‌న‌గ‌పిండి – 100 గ్రాములు
👉 ఉల్లిపాయ – 1
👉 ప‌చ్చిమిర్చి – 1
👉 అల్లం తురుము – 1 టీస్పూన్‌
👉 జీల‌క‌ర్ర – అర టీస్పూన్‌
👉 క‌రివేపాకు – 4 రెబ్బ‌లు
👉 కొత్తిమీర – 1 క‌ట్ట‌
👉 బేకింగ్ పౌడ‌ర్ – అర టీస్పూన్‌
👉 నూనె – వేయించ‌డానికి స‌రిప‌డా
👉 ఉప్పు – త‌గినంత‌

🥣 ప‌నీర్ బైట్స్‌ను త‌యారు చేసే విధానం..
ప‌నీర్ తురుములో శ‌న‌గ‌పిండి, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు, ప‌చ్చి మిర్చి, స‌న్న‌గా తురిమిన పుదీనా, క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. బేకింగ్ పౌడ‌ర్‌, ఉప్పు, జీల‌క‌ర్ర‌, త‌గిన‌న్ని నీళ్లు పోసి మృదువుగా క‌లిపి గుండ్ర‌ని బంతుల్లా త‌యారు చేయాలి. ఇప్పుడు వీటిని కాగిన నూనెలో బంగారు రంగులోకి వ‌చ్చే వ‌ర‌కు వేయించి తీసి పుదీనా చ‌ట్నీతో కానీ ట‌మాటా సాస్ కానీ తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఇష్టంగా తింటారు.

#Paneer #Bites #PaneerBites #Indian #Veg

https://t.me/indianrecipesvegetarian


Paneer Bites : సాయంత్రం స‌మ‌యంలో వేడిగా ప‌నీర్‌తో ఇలా స్నాక్స్ చేసి తినండి.. టేస్ట్ చూస్తే వ‌ద‌ల‌రు..!

సాయంత్రం అయిందంటే చాలు చాలా మంది ఏం చిరుతిండి తిందామా అని ఆలోచిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ర‌హ‌దారుల ప‌క్క‌న ల‌భించే నూనె ప‌దార్థాల‌ను తింటారు. కొంద‌రు బేక‌రీ ఫుడ్స్ తింటారు. అయితే ఇవ‌న్నీ మ‌న‌కు హాని క‌లిగించేవే. చ‌క్క‌గా ఇంట్లోనే త‌యారు చేసి స్నాక్స్ తింటే మ‌న‌కు ఎలాంటి హాని ఉండ‌దు. ఇక ఇంట్లో చేసుకోద‌గిన స్నాక్స్‌లో ప‌నీర్ బైట్స్ కూడా ఒక‌టి. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

👉 Read More : https://t.me/indianrecipesvegetarian/436




Chuduva Recipe : అటుకుల‌తో ఎంతో రుచిక‌ర‌మైన చుడువను ఇలా త‌యారు చేసి చూడండి.. టేస్టీగా ఉంటుంది..!

చుడువ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..
👉 అటుకులు – అర కేజీ
👉 వేరుశెన‌గ‌, పుట్నాల ప‌ప్పు – అర క‌ప్పు చొప్పున
👉 జీల‌క‌ర్ర‌, ఆవాలు – ఒక టీస్పూన్ చొప్పున‌
👉 కారం, ప‌సుపు – అర టీస్పూన్ చొప్పున‌
👉 ఉప్పు – త‌గినంత‌
👉 వెల్లుల్లి రెబ్బ‌లు – 6
👉 వెల్లుల్లి తురుము – 1 టీస్పూ్‌
👉 ఎండు మిర్చి – 3
👉 ప‌చ్చి మిర్చి చీలిక‌లు – 6
👉 క‌రివేపాకు రెమ్మ – 1

🥣 చుడువ‌ను త‌యారు చేసే విధానం..
స్ట‌వ్ మీద మంద‌పాటి పాత్ర పెట్టి అటుకుల‌ను క‌లుపుతూ గోధుమ రంగులోకి వ‌చ్చేంత వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్‌లోకి తీసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి. క‌డాయిలో నూనె పోసి వేడెక్కిన త‌రువాత వేర‌శెన‌గ ప‌ప్పు వేయాలి. అవి దోర‌గా వేగాక పుట్నాల ప‌ప్పు వేయాలి. దీంట్లోనే ఆవాలు, జీల‌క‌ర్ర‌, ప‌చ్చి మిర్చి చీలిక‌లు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి బాగా వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, ప‌సుపు, కారం, ఉప్పు, అటుకులు వేసి బాగా క‌ల‌పాలి. చివ‌ర‌గా వెల్లుల్లి తురుము వేయాలి. రెండు మూడు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే అటుకుల చుడువ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదా ప‌చ్చి ఉల్లిపాయ ముక్క‌లు, ట‌మాటా ముక్క‌లు, కొత్తిమీర చ‌ల్లి, నిమ్మ‌ర‌సం పిండి కూడా తిన‌వ‌చ్చు. ఎలా తిన్నా స‌రే చుడువ చాలా టేస్టీగా ఉంటుంది. అంద‌రూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. సాయంత్రం స‌మ‌యంలో దీన్ని చేసుకుంటే ఒక ప‌ట్టు ప‌ట్ట‌వ‌చ్చు.

#Chuduva

https://t.me/indianrecipesvegetarian


Chuduva Recipe : అటుకుల‌తో ఎంతో రుచిక‌ర‌మైన చుడువను ఇలా త‌యారు చేసి చూడండి.. టేస్టీగా ఉంటుంది..!

అటుకుల గురించి చాలా మందికి తెలిసిందే. ఇవి మ‌న‌కు అన్ని వేళ‌లా అందుబాటులో ఉంటాయి. అటుకుల‌తో చాలా మంది అనేక ర‌కాల వంటకాలను చేస్తుంటారు. వీటితో చాలా మంది మిక్చ‌ర్, చుడువ వంటివి చేస్తుంటారు. అయితే చుడువ ఎప్పుడు చేసినా కొంద‌రు స‌రిగ్గా చేయ‌లేకపోతుంటారు. స‌రైన టేస్ట్ రాదు. కానీ కింద చెప్పిన స్టైల్‌లో ఒక్క‌సారి చుడువ‌ను చేసి చూడండి. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఒక్క‌సారి టేస్ట్ చేశారంటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలాగే చేసుకుని తింటారు. ఇక చుడువ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో, దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

👉 Read More : https://t.me/indianrecipesvegetarian/433




Arikela Kichdi : ఎంతో ఆరోగ్య‌వంత‌మైన టిఫిన్ ఇది.. రోజూ ఉద‌యాన్నే 5 నిమిషాల్లో చేసి తిన‌వ‌చ్చు..!

అరికెల‌తో కిచిడీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..
👉 అరికెలు – అర క‌ప్పు
👉 పెస‌ర ప‌ప్పు – అర క‌ప్పు
👉 ప‌చ్చి బ‌ఠానీ – అర క‌ప్పు
👉 ఉల్లిపాయ – ఒక‌టి
👉 ట‌మాటా – 1
👉 అల్లం త‌రుగు – 1 టీస్పూన్‌
👉 ప‌చ్చి మిర్చి – 2
👉 క‌రివేపాకు రెబ్బ‌లు – 2
👉 జీల‌క‌ర్ర – అర టీస్పూన్‌
👉 ఇంగువ – చిటికెడు
👉 కారం – 1 టీస్పూన్‌
👉 ఉప్పు – త‌గినంత‌
👉 నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
👉 ప‌సుపు – కొద్దిగా

🥣 అరికెల‌తో కిచిడీని త‌యారు చేసే విధానం..
అరికెలు, పెస‌ర‌ప‌ప్పును ఒక గిన్నెలో తీసుకుని గంట‌సేపు నాన‌బెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద కుక్క‌ర్‌ని పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇది వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, అల్లం, ప‌చ్చి మిర్చి, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. త‌రువాత ప‌సుపు, ఇంగువ‌, ఉల్లిపాయ ముక్క‌లు, ట‌మాటా త‌రుగు, ప‌చ్చి బ‌ఠానీ వేసి బాగా క‌లిపి కారం, త‌గినంత ఉప్పు, రెండు క‌ప్పుల నీళ్లు పోసి అరికెలు, పెస‌ర ప‌ప్పు వేసి మూత పెట్టి ఒక కూత వ‌చ్చాక దింపేయాలి. త‌రువాత కిచిడీని బాగా క‌లిపి వ‌డ్డించేముందు మిగిలిన నెయ్యి వేస్తే స‌రిపోతుంది.

#Arikela #Kichdi #Vegetarian

https://t.me/indianrecipesvegetarian


Arikela Kichdi : ఎంతో ఆరోగ్య‌వంత‌మైన టిఫిన్ ఇది.. రోజూ ఉద‌యాన్నే 5 నిమిషాల్లో చేసి తిన‌వ‌చ్చు..!

Arikela Kichdi : ప్ర‌స్తుతం చాలా మంది అనేక ర‌కాల వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నారు. వాటిల్లో ఎక్కువ‌గా జీవ‌న‌శైలి సంబంధిత స‌మ‌స్య‌లే ఉంటున్నాయి. ఇవి స‌రైన ఆహారం తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే వ‌స్తున్నాయి. అయితే స‌రైన పోష‌కాహారాన్ని తీసుకుంటే ఈ వ్యాధుల నుంచి బయ‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు గాను చిరు ధాన్యాలు మ‌న‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. వాటిల్లో అరికెలు కూడా ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు పొంద‌వ‌చ్చు. ఇవి బ‌రువును త‌గ్గిస్తాయి. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. ఇక వీటితో ఆరోగ్య‌వంత‌మైన టిఫిన్‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు ఏమేం ప‌దార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

👉 Read more : https://t.me/indianrecipesvegetarian/430




Sour Curd : పెరుగు పుల్ల‌గా మారింద‌ని దాన్ని ప‌డేయ‌కండి.. దాంతో ఎన్నో ఆహారాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు..!

Sour Curd : దాదాపు అందరూ వేసవిలో పెరుగు తినడానికి ఇష్టపడతారు. కానీ కొన్నిసార్లు ఈ సీజన్‌లో దాని రుచి మరింత పుల్లగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, మీలో చాలా మంది అది చెడిపోయిందని భావించి ప‌డేస్తారు. పెరుగు పుల్లగా మారుతుంది ఎందుకంటే అందులో బ్యాక్టీరియా కిణ్వన‌ ప్రక్రియ పెరుగుతుంది. ఈ సీజన్‌లో పెరుగు ఒకటి రెండు రోజులకు మించి నిల్వ ఉంచితే పుల్లగా మారుతుంది. అయినప్పటికీ, పెరుగు చాలా పుల్లగా మారితే తినకూడదు. కానీ పులుపు సాధారణంగా ఉంటే, మీరు దీన్ని అనేక రకాల వంటకాలను చేయడానికి ఉపయోగించవచ్చు. రుచికరమైన వంటకాలు చేయడానికి మీరు పుల్లని పెరుగును ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

👉 Read More : https://t.me/healthcarenlifestyle/1807




Spicy Drumstick Pickle : మున‌క్కాయ‌ల‌తో కార కారంగా ఉండే ప‌చ్చ‌డి ఇలా పెట్టండి.. అన్నంలో నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

మున‌క్కాయ మెంతి ఊర‌గాయ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

👉 మెంతులు – ఒక టేబుల్ స్పూన్
👉 ఆవాలు – ఒక టేబుల్ స్పూన్
👉 ప‌ల్లీ నూనె -200 ఎమ్ ఎల్
👉 మున‌క్కాయ‌లు – 4
👉 కారం – 50గ్రా.
👉 ఉప్పు – 35గ్రా.
👉 చింత‌పండు – నిమ్మ‌కాయంత‌
👉 ప‌సుపు – అర టీ స్పూన్

మున‌క్కాయ మెంతి ఊర‌గాయ త‌యారీ విధానం..

ముందుగా మున‌క్కాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా తుడుచుకోవాలి. త‌రువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మెంతులు, ఆవాలు వేసి దోర‌గా వేయించాలి. ఇవి చ‌ల్లారిన త‌రువాత జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే చింత‌పండు కూడా వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మున‌క్కాయ ముక్క‌లు వేసి ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె చ‌ల్లారిన త‌రువాత కారం, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మెంతుల పొడి, ప‌సుపు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 4 గంట‌ల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత ఈ ప‌చ్చ‌డిని గాజు సీసాలో వేసి 2 రోజుల పాటు ఊర‌బెట్టిన త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మున‌క్కాయ మెంతి ఊర‌గాయ తయార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మున‌క్కాయ ఊర‌గాయ‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

#Spicy #Drumstick #Pickle #Vegetarian

https://t.me/indianrecipesvegetarian


Spicy Drumstick Pickle : మున‌క్కాయ‌ల‌తో కార కారంగా ఉండే ప‌చ్చ‌డి ఇలా పెట్టండి.. అన్నంలో నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Spicy Drumstick Pickle : మున‌క్కాయ‌ల‌తో మ‌నం ఎన్నో ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగ మున‌క్కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మున‌క్కాయ‌ల‌తో త‌రుచూ కూర‌లే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే ఊర‌గాయ‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఊర‌గాయ 6 నెల‌ల‌కు పైగా నిల్వ ఉంటుంది. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ఊర‌గాయ‌ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చ‌ళ్లు చేయ‌డం రాని వారు కూడా చిటికెలో ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ మున‌క్కాయ మెంతి ఊర‌గాయ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full : https://t.me/indianrecipesvegetarian/424




Hyderabad Style Special Veg Tahri : హైద‌రాబాద్ స్టైల్ స్పెష‌ల్ వెజ్ త‌హ్రి.. త‌యారీ ఇలా..!

🥣 హైదరాబాద్ స్టైల్ త‌హ్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

👉 నెయ్యి – 3 టీ స్పూన్స్
👉 నూనె – 2 టేబుల్ స్పూన్స్
👉 బిర్యానీ ఆకు – 1
👉 యాల‌కులు – 2
👉 ల‌వంగాలు – 2
👉 సాజీరా – ఒక టీ స్పూన్
👉 దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌
👉 అనాస‌పువ్వు – 1
👉 జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్
👉 పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1
👉 ఫ్రెంచ్ బీన్స్ ముక్క‌లు – అర క‌ప్పు
👉 ప‌చ్చిబ‌ఠాణీ – పావు క‌ప్పు
👉 క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు – 10
👉 క్యారెట్ ముక్క‌లు – పావు క‌ప్పు
👉 వేడి నీటిలో నాన‌బెట్టిన మీల్ మేక‌ర్ – 10
👉 త‌రిగిన బంగాళాదుంప – 1
👉 అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్
👉 ఉప్పు – త‌గినంత‌
👉 ప‌సుపు – పావు టీ స్పూన్
👉 కారం – ఒక టీ స్పూన్
👉 గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్
👉 త‌రిగిన ట‌మాట – 1
👉 నీళ్లు – ఒక క‌ప్పు
👉 గంటపాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – ఒక క‌ప్పు
👉 పెరుగు – అర క‌ప్పు
👉 త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా
👉 త‌రిగిన పుదీనా – కొద్దిగా
👉 త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4

🥣 హైదరాబాద్ స్టైల్ త‌హ్రీ త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు, జీల‌క‌ర్ర‌ వేసి వేయించాలి. ఇవ‌న్నీ వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత కూర‌గాయ ముక్క‌లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ప‌సుపు వేసి 10 నుండి 12 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత కారం, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, నీళ్లు పోసి క‌ల‌పాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత బియ్యం వేసి క‌ల‌పాలి. త‌రువాత పెరుగు, కొత్తిమీర‌, పుదీనా, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. ఇప్పుడు కుక్క‌ర్ మూత పెట్టి పెద్ద మంట‌పై ఒక విజిల్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హైదరాబాద్ స్టైల్ త‌హ్రీ త‌యార‌వుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలా సుల‌భంగా, చాలా రుచిగా తహ్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

#Hyderabad #Veg #Tahri #Vegetarian

https://t.me/indianrecipesvegetarian


Hyderabad Style Special Veg Tahri : హైద‌రాబాద్ స్టైల్ స్పెష‌ల్ వెజ్ త‌హ్రి.. త‌యారీ ఇలా..!

Hyderabad Style Special Veg Tahri : హైదరాబాద్ స్టైల్ త‌హ్రీ.. హైద‌రాబాద్ స్టైల్ లో చేసే ఈ వెజ్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు, వంట చేయ‌డం కుద‌ర‌న‌ప్పుడు సుల‌భంగా, రుచిగా ఈ త‌హ్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా కొత్త రుచులు కోరుకునే వారు దీనిని త‌ప్ప‌కుండా త‌యారు చేసుకోవాల్సిందే. పిల్ల‌లు కూడా దీనిని ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. రుచిగా, సుల‌భంగా హైదరాబాద్ స్టైల్ లో త‌హ్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

👉 Read Full : https://t.me/indianrecipesvegetarian/421



Показано 20 последних публикаций.