అమరావతి వేదికగా పీ4 కార్యక్రమం :
➥ ఉగాది రోజు శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న పీ4 కార్యక్రమానికి రాజధాని అమరావతి వేదిక కానుంది.
➥ తెలుగు నూతన సంవత్స రాది ఉగాది రోజు సాయంత్రం భారీ ఎత్తున ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టబోతోంది.
➥ ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడమే దీని లక్ష్య మని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.
➥ అమరా వతిలోని సచివాలయం ఒకటో బ్లాక్ వెనుక ఎన్ రహ దారికి పశ్చిమాన వేదికను ఏర్పాటు చేయాలని అధికా రులు నిర్ణయించారు.
➥ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పేదల చొప్పున దాదాపు 10 వేల మంది దీనికి హాజరుకానున్నారు.
➥ అందుకు తగ్గట్లు 50 ఎకరాల విస్తీర్ణంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తు న్నారు. అక్కడ కంప తొలగింపు పనులను శనివారం సాయంత్రం ప్రారంభించారు.
➥ గుంటూరు జిల్లా యంత్రాంగం, సీఆర్డీఏ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m