Indian Recipes Vegetarian


Гео и язык канала: Индия, Телугу
Категория: Еда и кулинария


All Vegetarian Traditional, Native, Local, Old recipes

Связанные каналы

Гео и язык канала
Индия, Телугу
Статистика
Фильтр публикаций




Spicy Drumstick Pickle : మున‌క్కాయ‌ల‌తో కార కారంగా ఉండే ప‌చ్చ‌డి ఇలా పెట్టండి.. అన్నంలో నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

మున‌క్కాయ మెంతి ఊర‌గాయ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

👉 మెంతులు – ఒక టేబుల్ స్పూన్
👉 ఆవాలు – ఒక టేబుల్ స్పూన్
👉 ప‌ల్లీ నూనె -200 ఎమ్ ఎల్
👉 మున‌క్కాయ‌లు – 4
👉 కారం – 50గ్రా.
👉 ఉప్పు – 35గ్రా.
👉 చింత‌పండు – నిమ్మ‌కాయంత‌
👉 ప‌సుపు – అర టీ స్పూన్

మున‌క్కాయ మెంతి ఊర‌గాయ త‌యారీ విధానం..

ముందుగా మున‌క్కాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా తుడుచుకోవాలి. త‌రువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మెంతులు, ఆవాలు వేసి దోర‌గా వేయించాలి. ఇవి చ‌ల్లారిన త‌రువాత జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే చింత‌పండు కూడా వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మున‌క్కాయ ముక్క‌లు వేసి ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె చ‌ల్లారిన త‌రువాత కారం, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మెంతుల పొడి, ప‌సుపు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 4 గంట‌ల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత ఈ ప‌చ్చ‌డిని గాజు సీసాలో వేసి 2 రోజుల పాటు ఊర‌బెట్టిన త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మున‌క్కాయ మెంతి ఊర‌గాయ తయార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మున‌క్కాయ ఊర‌గాయ‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

#Spicy #Drumstick #Pickle #Vegetarian

https://t.me/indianrecipesvegetarian


Spicy Drumstick Pickle : మున‌క్కాయ‌ల‌తో కార కారంగా ఉండే ప‌చ్చ‌డి ఇలా పెట్టండి.. అన్నంలో నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Spicy Drumstick Pickle : మున‌క్కాయ‌ల‌తో మ‌నం ఎన్నో ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగ మున‌క్కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మున‌క్కాయ‌ల‌తో త‌రుచూ కూర‌లే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే ఊర‌గాయ‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఊర‌గాయ 6 నెల‌ల‌కు పైగా నిల్వ ఉంటుంది. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ఊర‌గాయ‌ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చ‌ళ్లు చేయ‌డం రాని వారు కూడా చిటికెలో ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ మున‌క్కాయ మెంతి ఊర‌గాయ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full : https://t.me/indianrecipesvegetarian/424




Hyderabad Style Special Veg Tahri : హైద‌రాబాద్ స్టైల్ స్పెష‌ల్ వెజ్ త‌హ్రి.. త‌యారీ ఇలా..!

🥣 హైదరాబాద్ స్టైల్ త‌హ్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

👉 నెయ్యి – 3 టీ స్పూన్స్
👉 నూనె – 2 టేబుల్ స్పూన్స్
👉 బిర్యానీ ఆకు – 1
👉 యాల‌కులు – 2
👉 ల‌వంగాలు – 2
👉 సాజీరా – ఒక టీ స్పూన్
👉 దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌
👉 అనాస‌పువ్వు – 1
👉 జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్
👉 పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1
👉 ఫ్రెంచ్ బీన్స్ ముక్క‌లు – అర క‌ప్పు
👉 ప‌చ్చిబ‌ఠాణీ – పావు క‌ప్పు
👉 క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు – 10
👉 క్యారెట్ ముక్క‌లు – పావు క‌ప్పు
👉 వేడి నీటిలో నాన‌బెట్టిన మీల్ మేక‌ర్ – 10
👉 త‌రిగిన బంగాళాదుంప – 1
👉 అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్
👉 ఉప్పు – త‌గినంత‌
👉 ప‌సుపు – పావు టీ స్పూన్
👉 కారం – ఒక టీ స్పూన్
👉 గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్
👉 త‌రిగిన ట‌మాట – 1
👉 నీళ్లు – ఒక క‌ప్పు
👉 గంటపాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – ఒక క‌ప్పు
👉 పెరుగు – అర క‌ప్పు
👉 త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా
👉 త‌రిగిన పుదీనా – కొద్దిగా
👉 త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4

🥣 హైదరాబాద్ స్టైల్ త‌హ్రీ త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు, జీల‌క‌ర్ర‌ వేసి వేయించాలి. ఇవ‌న్నీ వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత కూర‌గాయ ముక్క‌లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ప‌సుపు వేసి 10 నుండి 12 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత కారం, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, నీళ్లు పోసి క‌ల‌పాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత బియ్యం వేసి క‌ల‌పాలి. త‌రువాత పెరుగు, కొత్తిమీర‌, పుదీనా, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. ఇప్పుడు కుక్క‌ర్ మూత పెట్టి పెద్ద మంట‌పై ఒక విజిల్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హైదరాబాద్ స్టైల్ త‌హ్రీ త‌యార‌వుతుంది. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలా సుల‌భంగా, చాలా రుచిగా తహ్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

#Hyderabad #Veg #Tahri #Vegetarian

https://t.me/indianrecipesvegetarian


Hyderabad Style Special Veg Tahri : హైద‌రాబాద్ స్టైల్ స్పెష‌ల్ వెజ్ త‌హ్రి.. త‌యారీ ఇలా..!

Hyderabad Style Special Veg Tahri : హైదరాబాద్ స్టైల్ త‌హ్రీ.. హైద‌రాబాద్ స్టైల్ లో చేసే ఈ వెజ్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు, వంట చేయ‌డం కుద‌ర‌న‌ప్పుడు సుల‌భంగా, రుచిగా ఈ త‌హ్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా కొత్త రుచులు కోరుకునే వారు దీనిని త‌ప్ప‌కుండా త‌యారు చేసుకోవాల్సిందే. పిల్ల‌లు కూడా దీనిని ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. రుచిగా, సుల‌భంగా హైదరాబాద్ స్టైల్ లో త‌హ్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

👉 Read Full : https://t.me/indianrecipesvegetarian/421




Minapapappu Pachadi : మిన‌ప ప‌ప్పు ప‌చ్చ‌డి ఇలా చేయండి.. అన్నం, ఇడ్లీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

మిన‌ప‌ప్పు ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..


👉 నూనె – ఒక టీ స్పూన్
👉 పొట్టు మినుములు – అర క‌ప్పు
👉 జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్
👉 ఎండుమిర్చి – 8 నుండి 10
👉 మెంతులు – అర టీ స్పూన్
👉 చింత‌పండు – నిమ్మ‌కాయంత‌
👉 ఉప్పు – త‌గినంత‌
👉 బెల్లం – ఒక టేబుల్ స్పూన్
👉 వెల్లుల్లి రెమ్మ‌లు – 5
👉 ఆవాలు – అర టీ స్పూన్
👉 క‌రివేపాకు – ఒక రెమ్మ‌

మిన‌ప‌ప్పు ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మిన‌ప‌ప్పు వేసి వేయించాలి.దీనిని 15 నిమిషాల పాటు దోర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చి వేసి వేయించి వీటిని కూడా జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మెంతులు వేసి వేయించాలి. మెంతులు దోర‌గా వేగిన త‌రువాత చింత‌పండు వేసి మ‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇదే జార్ లో ఉప్పు, బెల్లం, వెల్లుల్లి రెమ్మ‌లు కూడా వేడి నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత దీనిని ప‌చ్చ‌డిలో వేసి క‌లిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మిన‌ప‌ప్పు ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని ఏ అల్పాహారాల‌తో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా రుచిగా, క‌మ్మ‌గా మిన‌ప‌ప్పుతో ప‌చ్చ‌డిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

#Minapapappu #Pachadi #Pickel #Vegetarian

https://t.me/indianrecipesvegetarian


Minapapappu Pachadi : మిన‌ప ప‌ప్పు ప‌చ్చ‌డి ఇలా చేయండి.. అన్నం, ఇడ్లీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Minapapappu Pachadi : మిన‌ప‌ప్పుతో మ‌నం ఎక్కువ‌గా అల్పాహారాల‌ను, పిండి వంట‌కాల‌ను, తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మిన‌ప‌ప్పుతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అయితే త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు మిన‌ప‌ప్పుతో మ‌నం ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మిన‌ప‌ప్పుతో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా, క‌మ్మ‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. ఈ ప‌చ్చ‌డిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ మిన‌ప‌ప్పు ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

👉 Read Full : https://t.me/indianrecipesvegetarian/418




Kothimeera Pudina Nilva Pachadi : కొత్తిమీర పుదీనా నిల్వ ప‌చ్చ‌డి ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

🥣 కొత్తిమీర పుదీనా నిల్వ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

👉 త‌రిగిన కొత్తిమీర – ఒక క‌ట్ట ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది)
👉 త‌రిగిన పుదీనా – ఒక క‌ట్ట ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది)
👉 కొత్తిమీర – 2 రెమ్మ‌లు
👉 వేడి నీటిలో నాన‌బెట్టిన చింత‌పండు – పెద్ద నిమ్మ‌కాయంత‌
👉 మెంతులు – అర టీ స్పూన్
👉 జీల‌క‌ర్ర – అర టీ స్పూన్
👉 ఆవాలు – ఒక టీ స్పూన్
👉 నూనె – పావు క‌ప్పు
👉 ప‌సుపు – పావు టీ స్పూన్
👉 కారం – 2 టేబుల్ స్పూన్స్
👉 ఉప్పు – 2 టేబుల్ స్పూన్స్ లేదా త‌గినంత‌.

🥣 తాళింపుకు కావ‌ల్సిన ప‌దార్థాలు..

👉 నూనె – అర క‌ప్పు
👉 మిన‌పప్పు – ఒక టీ స్పూన్
👉 ఆవాలు – అర టీ స్పూన్
👉 జీల‌క‌ర్ర – అర టీ స్పూన్
👉 వెల్లుల్లి రెమ్మ‌లు – 10
👉 క‌రివేపాకు – ఒక రెమ్మ‌
👉 ఎండుమిర్చి – 2

🥣 కొత్తిమీర పుదీనా నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా కొత్తిమీర‌, పుదీనా, క‌రివేపాకును శుభ్రంగా క‌డిగి త‌డి లేకుండా ఆర‌బెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మెంతులు, జీల‌క‌ర్ర‌, ఆవాలు వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి పొడిగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆర‌బెట్టుకున్న కొత్తిమీర‌, పుదీనా, క‌రివేపాకు వేసి వేయించాలి. వీటిని క్రిస్సీగా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌సుపు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత చింత‌పండు నుండి గుజ్జును తీసుకుని గిన్నెలో వేసుకోవాలి. త‌రువాత వేయించిన కొత్తిమీర‌, పుదీనా వేసుకోవాలి. త‌రువాత కారం, ఉప్పు, వేయించిన ఆవాల పొడి వేసి క‌లుపుకోవాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు వేసి చ‌క్క‌గా వేయించాలి. త‌రువాత ఈ తాళింపును ప‌చ్చ‌డిలో వేసి క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పుదీనా నిల్వ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల నెల‌రోజుల పాటు తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ ప‌చ్చ‌డిని తింటే చాలా రుచిగా ఉంటుంది.

#Kothimeera #Pudina #Nilva_Pachadi #Pickel #Vegetarian

https://t.me/indianrecipesvegetarian


Kothimeera Pudina Nilva Pachadi : కొత్తిమీర పుదీనా నిల్వ ప‌చ్చ‌డి ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Kothimeera Pudina Nilva Pachadi : కొత్తిమీర పుదీనా నిల్వ ప‌చ్చ‌డి.. కొత్తిమీర‌, పుదీనా క‌లిపి చేసే ఈ నిల్వ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, అల్పాహారాల‌తో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఇంట్లో అంద‌రూ ఈ ప‌చ్చ‌డిని లొట్ట‌లేసుకుంటూ తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు కూడా ఈ పచ్చ‌డిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ కొత్తిమీర పుదీనా నిల్వ ప‌చ్చడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

👉 Read Full : https://t.me/indianrecipesvegetarian/415




Kakarakaya Vepudu : చేదు అస్స‌లు లేకుండా కాక‌ర‌కాయ వేపుడు ఇలా చేయండి.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!

కాక‌ర‌కాయ వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

👉 కాక‌ర‌కాయ‌లు – పావుకిలో
👉 ప‌ల్లీలు – ఒక టేబుల్ స్పూన్
👉 ధ‌నియాలు – ఒక టీ స్పూన్
👉 జీల‌క‌ర్ర – అర టీ స్పూన్
👉 ఎండుకొబ్బ‌రి ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్
👉 మ‌జ్జిగ – ఒక క‌ప్పు
👉 నీళ్లు – అర‌గ్లాస్
👉 ప‌సుపు – పావు టీ స్పూన్
👉 ఉప్పు – అర టీ స్పూన్
👉 కారం – ఒక టేబుల్ స్పూన్
👉 వెల్లుల్లి రెబ్బ‌లు – 4
👉 నూనె – పావు క‌ప్పు
👉 క‌రివేపాకు – 2 రెమ్మ‌లు

కాక‌ర‌కాయ వేపుడు త‌యారీ విధానం..

📍 ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు, ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని అందులోనే కారం, ఉప్పు, వెల్లుల్లి రెమ్మ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత కాక‌ర‌కాయ‌ల‌పై ఉండే చెక్కును తీసేసి వాటిని పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత కళాయిలో మ‌జ్జిగ‌, నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి.త‌రువాత కాక‌ర‌కాయ ముక్క‌లు వేసి మ‌జ్జిగ అంతా ఇంకిపోయి ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత కాక‌ర‌కాయ ముక్క‌ల‌ను ఒక్కొక్క‌టిగా తీసుకుని వాటిలో ఉండే గింజ‌ల‌ను తీసేసి అలాగే వాటిలో ఉండే నీరంతా పోయేలా పిండి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి.

📍 నూనె వేడ‌య్యాక ముక్క‌లు, క‌రివేపాకు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌రకుబాగా వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న కారం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చేదు లేకుండా ఎంతో రుచిగా ఉండే కాక‌ర‌కాయ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది.అలాగే ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తిన‌వ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన కాక‌ర‌కాయ వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

#Kakarakaya #Vepudu #bitterness #Vegetarian #Fries

https://t.me/indianrecipesvegetarian


Kakarakaya Vepudu : చేదు అస్స‌లు లేకుండా కాక‌ర‌కాయ వేపుడు ఇలా చేయండి.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!

Kakarakaya Vepudu : కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కాక‌ర‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కాక‌రకాయ వేపుడు కూడా ఒక‌టి. కాక‌ర‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే మ‌రికొంద‌రు చేదుగా ఉంటాయ‌నే కార‌ణంగా కాక‌రకాయ‌ల‌ను తిన‌డానికే ఇష్ట‌ప‌డ‌రు. అలాంటి వారు కూడా ఇష్టంగా తినేలా చేదు లేకుండా మ‌నం కాక‌ర‌కాయ వేపుడును త‌యారు చేసుకోవ‌చ్చు. పాత ప‌ద్దతిలో చేసే ఈ కాక‌ర‌కాయ వేపుడు చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. కాక‌రకాయ‌ల‌ను ఇష్ట‌ప‌డని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. చేదు లేకుండాపాత కాలంలో మాదిరి కాక‌ర‌కాయ వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

👉 Read Full : https://t.me/indianrecipesvegetarian/412




Street Style Paneer Samosa : రోడ్డు ప‌క్క‌న బండ్ల‌పై అమ్మే ప‌నీర్ స‌మోసా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

🥣 స్ట్రీట్ స్టైల్ పనీర్ స‌మోసా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

👉 నూనె – ఒక టేబుల్ స్పూన్
👉 జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్
👉 త‌రిగిన ఉల్లిపాయ -1
👉 చిన్న‌గా త‌రిగిన పెద్ద క్యాప్సికం – 1
👉 ఉప్పు – కొద్దిగా
👉 చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1
👉 చాట్ మ‌సాలా – ఒక టీ స్పూన్
👉 గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్
👉 అటుకులు – పిడికెడు
👉 స‌మోసా స్ట్రిప్స్ – త‌గిన‌న్ని
👉 మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్

🥣 ప‌నీర్ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

👉 చిలికిన పెరుగు – అర క‌ప్పు
👉 మిరియాల పొడి – అర టీ స్పూన్
👉 కారం – ఒక టీ స్పూన్
👉 ఉప్పు – త‌గినంత‌
👉 వేయించిన జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్
👉 ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్
👉 ప‌నీర్ – 200 గ్రా..

🥣 స్ట్రీట్ స్టైల్ పనీర్ స‌మోసా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ప‌నీర్ త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌ను తీసుకుని బాగా క‌లపాలి. త‌రువాత ప‌నీర్ ను స్ట్రిప్స్ లాగా క‌ట్ చేసుకుని వేసుకోవాలి. ప‌నీర్ కు ఈ మిశ్ర‌మం ప‌ట్టేలా క‌లుపుకుని అర‌గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత గ్రిల్ చేసే ప్యాన్ ను తీసుకుని దానిపై నూనె వేసుకోవాలి. త‌రువాత ప‌నీర్ వేసి వేయించాలి. పనీర్ ను అన్ని వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత దీనిని ముక్క‌లుగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత క్యాప్సికం త‌రుగు, ప‌చ్చిమిర్చి త‌రుగు, ఉప్పు వేసి మ‌రో 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత చాట్ మ‌సాలా, గ‌రం మ‌సాలా వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత అటుకులు వేసి క‌లిపి ఈ మిశ్ర‌మం చ‌ల్లారే వ‌ర‌కు అలాగే ఉంచాలి.

ఈ మిశ్ర‌మం చ‌ల్లారిన త‌రువాత క‌ట్ చేసుకున్న ప‌నీర్ వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని త‌గిన‌న్నినీళ్లు పోసి పేస్ట్ లాగా చేసి ప‌క్కకు ఉంచాలి. త‌రువాత స‌మోసా స్ట్రిప్స్ ను ఒక్కొక్క‌టిగా తీసుకుని స‌మోసా ఆకారంలో చుట్టుకోవాలి. త‌రువాత ఇందులో నిండుగా ప‌నీర్ మిశ్ర‌మాన్ని ఉంచి అంచుల‌కు మైదాపిండి పేస్ట్ ను రాసి అంచుల‌ను మూసి వేయాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో డీప్ ఫ్రైకు నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక సమోసాలను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా, క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్ట్రీట్ స్టైల్ స‌మోసాలు త‌యార‌వుతాయి. వీటిని వేయించిన మిర్చి, ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

#Street_Style #Paneer #Samosa #Snacks #Vegetarian #IndainFoods

https://t.me/indianrecipesvegetarian/


Street Style Paneer Samosa : రోడ్డు ప‌క్క‌న బండ్ల‌పై అమ్మే ప‌నీర్ స‌మోసా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Street Style Paneer Samosa : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో బండ్ల మీద ల‌భించే వాటిలో స‌మోసాలు కూడా ఒక‌టి. స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మ‌నకు వివిధ రుచుల్లో ఈ స‌మోసాలు ల‌భిస్తూ ఉంటాయి. వాటిలో ప‌నీర్ స‌మోసా కూడా ఒక‌టి. ప‌నీర్ స‌మోసా చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ స‌మోసాను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. వేడి వేడిగా స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా ప‌నీర్ తో స‌మోసాల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ప‌నీర్ స‌మోసాల‌ను స్ట్రీట్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

👉 Read Full : https://t.me/indianrecipesvegetarian/409




Soya Cutlet : క‌ర‌క‌ర‌లాడే వేడి వేడి సోయా క‌ట్‌లెట్స్‌.. ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

🥣 సోయా క‌ట్లెట్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

👉 వేడి నీళ్లు – 2క‌ప్పులు
👉 మీల్ మేక‌ర్ – ఒక కప్పు
👉 చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1
👉 అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్
👉 త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా
👉 కారం – ఒక టీ స్పూన్
👉 ఉప్పు – త‌గినంత‌
👉 ప‌సుపు – పావు టీ స్పూన్
👉 ధ‌నియాల పొడి – అర టీ స్పూన్
👉 గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్
👉 ఉడికించిన బంగాళాదుంప‌లు – 2
👉 బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్
👉 మైదాపిండి – పావు క‌ప్పు
👉 బ్రెడ్ క్రంబ్స్ – ఒక క‌ప్పు
👉 నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా

🥣 సోయా క‌ట్లెట్స్ త‌యారీ విధానం..

📍 ముందుగా వేడి నీళ్లల్లో ఉప్పు వేసిక‌ల‌పాలి. త‌రువాత మీల్ మేక‌ర్స్ వేసి 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. తరువాత వీటిని చేత్తో నీరంతా పోయేలా పిండి జార్ లో వేసుకోవాలి. ఈ మీల్ మేక‌ర్ ల‌ను మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత బంగాళాదుంప‌ల‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర‌, ఉల్లిపాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత బియ్యం పిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత కొద్దిగా నీటిని వేసుకుని అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి.

📍 ఇప్పుడు కొద్ది కొద్దిగా మిశ్ర‌మాన్ని తీసుకుంటూ క‌ట్లెట్ ల ఆకారంలో వ‌త్తుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసి బాగా క‌ల‌పాలి. ఇప్పుడు క‌ట్లెట్ ల‌ను మైదాపిండి మిశ్ర‌మంలో ముంచి ఆ త‌రువాత బ్రెడ్ క్రంబ్స్ తో కోటింగ్ చేసుకోవాలి. త‌రువాత ఈ క‌ట్లెట్ ను వేడి నూనెలో వేసి కాల్చుకోవాలి. దీనిని రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు మ‌ధ్య‌స్థ మంట‌పై కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సోయా క‌ట్లెట్స్ త‌యార‌వుతాయి. వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా త‌యారు చేసిన క‌ట్లెట్స్ ను ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

#SoyaCutlet #Cutlet #Snacks #Vegetarian #IndainFoods

https://t.me/indianrecipesvegetarian

Показано 20 последних публикаций.