Soya Cutlet : కరకరలాడే వేడి వేడి సోయా కట్లెట్స్.. ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
🥣 సోయా కట్లెట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
👉 వేడి నీళ్లు – 2కప్పులు
👉 మీల్ మేకర్ – ఒక కప్పు
👉 చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1
👉 అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్
👉 తరిగిన కొత్తిమీర – కొద్దిగా
👉 కారం – ఒక టీ స్పూన్
👉 ఉప్పు – తగినంత
👉 పసుపు – పావు టీ స్పూన్
👉 ధనియాల పొడి – అర టీ స్పూన్
👉 గరం మసాలా – అర టీ స్పూన్
👉 ఉడికించిన బంగాళాదుంపలు – 2
👉 బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్
👉 మైదాపిండి – పావు కప్పు
👉 బ్రెడ్ క్రంబ్స్ – ఒక కప్పు
👉 నూనె – డీప్ ఫ్రైకు సరిపడా
🥣 సోయా కట్లెట్స్ తయారీ విధానం..
📍 ముందుగా వేడి నీళ్లల్లో ఉప్పు వేసికలపాలి. తరువాత మీల్ మేకర్స్ వేసి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని చేత్తో నీరంతా పోయేలా పిండి జార్ లో వేసుకోవాలి. ఈ మీల్ మేకర్ లను మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత బియ్యం పిండి వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీటిని వేసుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి.
📍 ఇప్పుడు కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ కట్లెట్ ల ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. ఇప్పుడు కట్లెట్ లను మైదాపిండి మిశ్రమంలో ముంచి ఆ తరువాత బ్రెడ్ క్రంబ్స్ తో కోటింగ్ చేసుకోవాలి. తరువాత ఈ కట్లెట్ ను వేడి నూనెలో వేసి కాల్చుకోవాలి. దీనిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు మధ్యస్థ మంటపై కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సోయా కట్లెట్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన కట్లెట్స్ ను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
#SoyaCutlet #Cutlet #Snacks #Vegetarian #IndainFoods
https://t.me/indianrecipesvegetarian