మత్స్యకారులకు ఏప్రిల్లో రూ.20వేలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. వేట నిలిచిన సమయంలో గత ప్రభుత్వం రూ. 10వేలు ఇస్తే తాము రూ.20 వేలు ఇవ్వనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం కోసం పీఎం కిసాన్ మొత్తంతో కలిపి 'అన్నదాత సుఖీభవ' సాయం అందిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి మెగా డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు.