తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel


Kanal geosi va tili: Hindiston, Inglizcha


తిరుమల సమాచారం. https://www.youtube.com/laxmitelugutech

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Hindiston, Inglizcha
Statistika
Postlar filtri


👆 టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల‌ మండ‌లి ముఖ్య నిర్ణ‌యాలు

తిరుమ‌ల‌, 2024 న‌వంబ‌రు 18 : టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి చైర్మ‌న్ శ్రీ బి.ఆర్ నాయుడు అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం ఉద‌యం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో తొలి స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ముఖ్య నిర్ణ‌యాలను చైర్మ‌న్ మీడియాకు వివ‌రించారు.

- ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజన్స్ ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేందుకు నిర్ణ‌యం.

- టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం.

- తిరుమలలో డంపింగ్ యార్డులోని చెత్తను మూడు లేదా నాలుగు నెలల్లో క్లియర్ చేయాలని నిర్ణ‌యం.

- తిరుప‌తిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చడానికి నిర్ణయం.

- అలిపిరిలో టూరిజం కార్పోరేష‌న్ ద్వారా దేవలోక్ కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం.

- తిరుమలలో రాజకీయాలు మాట్లాడేవారిని, ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం.

- తిరుపతి స్థానికులకు ప్ర‌తి నెలా మొద‌టి మంగ‌ళ‌వారం శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం.

- శ్రీ‌వాణి ట్రస్టు పేరును మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్టు ఇవ్వాలని ఆదేశం.

- ప్ర‌యివేటు బ్యాంకుల్లో డిపాజిట్లను వెనక్కు తీసుకుని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నిర్ణయం. ఈ అంశంపై వచ్చే సమావేశంలో చర్చిస్తాం.

- నిత్య అన్న ప్రసాద భవనం మెనూలో అద‌నంగా మ‌రొక‌ ప‌దార్థాన్ని చేర్చేందుకు నిర్ణ‌యం.

- వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పోరేషన్లు, ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300/-) టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులు నేపథ్యంలో వాటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం సదరు సంస్థలకు కోటాను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం.

- తిరుమ‌ల‌లో గోగ‌ర్భం డ్యామ్ వ‌ద్ద విశాఖ శ్రీ శార‌ద పీఠానికి చెందిన మ‌ఠం నిర్మాణంలో అవ‌క‌త‌వ‌క‌లు, ఆక్ర‌మ‌ణలు జ‌రిగిన‌ట్లు టిటిడి అధికారుల క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భ‌వ‌నం లీజును ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యం.

- బ్ర‌హ్మోత్స‌వాలలో విశేష సేవ‌లు అందించిన ఉద్యోగుల‌కు గ‌త సంవ‌త్స‌రం ఇచ్చిన బ్ర‌హ్మోత్స‌వ బ‌హుమానాన్ని 10 శాతం పెంచాల‌ని నిర్ణ‌యం. త‌ద్వారా రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు రూ.15,400/-, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు రూ.7,535/- బ్ర‌హ్మోత్స‌వ బ‌హుమానం.

- శ్రీ‌వారి ఆల‌యంలో లీకేజీల నివార‌ణ‌కు, అన్న ప్ర‌సాద కేంద్రం ఆధునీక‌ర‌ణ‌కు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ. ఈ ప‌నులు ఉచితంగా చేయ‌నున్న టీవీఎస్ సంస్థ‌.

టీటీడీ ముఖ్య ప్ర‌జాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయ‌బ‌డిన‌ది.










ఫిబ్రవరి-2025 తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు బుకింగ్ కోసం 23.11.2024 10:00 AMకి అందుబాటులో ఉంటాయి.

How to book angapradakshinam tickets online step by step :-
https://youtu.be/D9f_A6cIY64




టీటీడీ స్థానిక ఆల‌యాల క్యాలెండ‌ర్లను ఆవిష్క‌రించిన టీటీడీ ఛైర్మ‌న్‌

తిరుమ‌ల‌, 2024 నవంబ‌రు 18: టీటీడీ స్థానిక ఆల‌యాల క్యాలెండ‌ర్లను టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బి ఆర్ నాయుడు, ఈవో శ్రీ జె. శ్యామల రావుతో క‌లిసి ఆవిష్క‌రించారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమవారం టీటీడీ బోర్డు మీటింగ్‌ అనంత‌రం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

టీటీడీ స్థానిక ఆల‌యాలైన తిరుమలలోని శ్రీ భూ వరాహ స్వామి, తిరుపతి సమీపంలోని పేరూరు శ్రీ వకుళమాత ఆలయం, అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి, నారాయ‌ణ‌వ‌నం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి, నాగ‌లాపురం శ్రీ వేద నారాయ‌ణ‌స్వామి, కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామి, ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి మూల‌మూర్తులు, ఉత్స‌వ‌మూర్తుల‌తో కూడిన క్యాలెండ‌ర్ల‌ను టీటీడీ అత్య‌ద్భుతంగా రూపొందించి ముద్రించింది. ఈ క్యాలెండర్లు బుధవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి హెచ్ వెంకయ్య చౌదరి, ప‌లువురు బోర్డు స‌భ్యులు, జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


👆 శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా ముగిసిన చండీయాగం

తిరుప‌తి, 2024 నవంబరు 18: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం) సోమవారం వైభవంగా ముగిసింది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 10 నుంచి 18వ తేదీ వరకు చండీయాగం నిర్వహించారు.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు చండీహోమం సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాభిషేకం, అమ్మ‌వారి మూల‌వ‌ర్ల‌కు కలశాభిషేకం నిర్వహించారు.

సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి కలశస్థాపన, పూజ, జపం, హోమం, నివేదన, హారతి నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నవంబరు 19 నుంచి రుద్రయాగం

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 19 నుంచి 29వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) జరుగనుంది.

గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.




తిరుమల https://youtube.com/live/qg89JctKo3s?feature=share

ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం

చైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశం

సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం

ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ సహాయంతో సామాన్య భక్తులు మూడు గంటల్లో దర్శన భాగ్యం

అన్యమత ఉద్యోగస్తులతో మాట్లాడుతాం

విఆర్ఎస్ తీసుకుంటే విఆర్ఎస్ ఇస్తాం…. లేకుంటే ఇతర శాఖలకు బదిలీ చేస్తాం

శ్రీనివాస సేతు కు గరుడ వారధిగా పేరు మార్పు

20 ఎకరాల్లో దేవలోక్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది….

ఆ స్థలంలో ఇప్పుడు ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్ చేపట్టారు

ఆ ప్రభుత్వ స్థలాన్ని టీటీడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్న

తిరుమలలో రాజకీయాలు ప్రసంగాలు నిషేధం, మాట్లాడితే కేసులు పెట్టే విధంగా చర్యలు

స్థానికులకు దర్శన భాగ్యం కల్పన…. ప్రతి నెల మొదటి మంగళవారం దర్శన భాగ్యం కల్పిస్తాం

శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసి…. వేరొక ట్రస్ట్ లో విలీనం చేస్తాం

ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను గవర్నమెంట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విధంగా చర్యలు

నిత్య అన్నదానంను మరింత మెరుగుపరిచేలా చర్యలు… మెనూ లో మరిన్ని ఆహార పదార్థాలు అందుబాటులో తీసుకొస్తాం

టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయం

శారదాపీఠంకు ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దు చేసి… టీటీడీ స్వాధీనం చేసుకుంటుంది

శాశ్వత ఉద్యోగులకు 17,400…. కాంట్రాక్టు ఉద్యోగులకు 7530 బ్రహ్మోత్సవ బహుమానం

టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు…. ఇందులో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు సమాచారం

*-బిఆర్ నాయుడు, టీటీడీ పాలకమండలి చైర్మన్*


అన్నదానం కేంద్రంలో 2 లక్షల మంది కి అన్నప్రసాదం వితరణ

అన్నప్రసాద కేంద్రంలో నూతన పరికరాలు అమర్చి…. ఆధునీకరణకు టీవీఎస్ కు ఇచ్చేందుకు నిర్ణయం

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఎలా చేయాలనే దానిపై అధ్యయనం చేస్తున్నాం

సామాన్య భక్తులకు త్వరిత గతిన శ్రీవారి దర్శనభాగ్యం కల్పించే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురానున్నాం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్ట్యువల్ క్యూ ఏర్పాటు చేస్తాం

*-శ్యామల రావు, టీటీడీ ఈవో*




ఉత్తరాది మఠం ప్రధాన పీఠాధిపతి వేంకటేశ్వర స్వామికి ప్రార్థనలు చేశారు.

తిరుమల, 18 నవంబర్. 24: ఉత్తరాది మఠం పీఠాధిపతి జగద్గురువులు శ్రీశ్రీశ్రీశ్రీ 1008 శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. శ్రీవారి ఆలయం ఎదురుగా వచ్చిన ఆయన టిటిడి అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి గర్భాలయానికి తీసుకెళ్లారు.

డీవైఈవో శ్రీ లోకనాధం, పీష్కార్ శ్రీరామకృష్ణ, వీజీవో శ్రీ సురేంద్ర పార్థేదార్ శ్రీ హిమత్‌గిరి తదితరులు పాల్గొన్నారు.

TTD చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, తిరుపతి ద్వారా జారీ చేయబడింది


Tirupati SSD & Srivari Mettu Tokens Present Available Status


శ్రీవారి సేవకుల విధుల కేటాయింపు వారి మొత్తం సేవా కాలంలో ఒకే విభాగంలో లేదా ప్రదేశంలో చేయబడుతుంది.

ఆ సమయంలో TTD యొక్క నిర్దిష్ట అవసరాలను బట్టి సేవకులకు విధుల కేటాయింపు వ్యక్తిగతంగా లేదా సమూహాలలో చేయవచ్చు.

ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారానే శ్రీవారి సేవకులకు ఆలయ విధులు కేటాయిస్తున్నారు. ప్రతి బృందం ఆలయ విధులను పొందడం తప్పనిసరి కాదు.

ఈ విషయంలో ఏదైనా విచలనం వినోదం పొందదు.


Tirupati SSD & Srivari Mettu Tokens Present Available Status




🙏 Om Namo Venkatesaya 🙏

17-11-2024

Total pilgrims - 71,441

Tonsures: 23,595

Hundi kanukalu : 3.87 Cr

Waiting Compartments…03

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens)... 8 H

(SSD)Time slot Sarvadarshan... 2 to 4 H

Rs 300 Special Darshan Approx. Time... 1 to 3 H

Tq.

------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి గంటల సమయం 5 పడుతుంది, అంటే అది SSDటోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 5 గంటలు అని.

ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

----
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-

https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

https://t.me/LaxmiTeluguTech

https://www.youtube.com/@TtdLatestUpdates

👉 New Channel ( ఇ News తెలుగు ) :-https://www.youtube.com/@enewstelugu?sub_confirmation=1


Tirupati SSD & Srivari Mettu Tokens Present Available Status


Tirupati SSD & Srivari Mettu Tokens Present Available Status

20 ta oxirgi post ko‘rsatilgan.